Shivam Dubey: స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేను బ్రాండ్ అంబాసిడర్‭గా నియమించిన పరిమ్యాచ్ స్పోర్ట్స్

పరిమ్యాచ్ స్పోర్ట్స్ దుస్తులు చాలా ఆసక్తిగా, స్టైలిష్‌గా ఉన్నాయని.. మంచి స్టైల్‌ని మెచ్చుకునే వ్యక్తిగా, తాను వీటిని విపరీతంగా అభిమానిస్తున్నానని వెల్లడించారు. దీనితో పాటుగా, తన అభిమానులతో సందేశాలను పంచుకోటంతో పాటుగా ఔత్సాహిక అథ్లెట్లకు విలువైన సలహాలను అందించారు.

Shivam Dubey: స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేను బ్రాండ్ అంబాసిడర్‭గా నియమించిన పరిమ్యాచ్ స్పోర్ట్స్

Updated On : June 22, 2023 / 8:31 PM IST

Parimatch Sports: స్పోర్ట్స్ వేర్ బ్రాండ్, పరిమ్యాచ్ స్పోర్ట్స్ తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్‭గా క్రికెటర్ శివమ్ దూబేను ఎంచుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవలి IPLలో అతని ప్రదర్శన, భవిష్యత్తు ప్రయత్నాల గురుంచి తెలుసుకునే అవకాశం కూడా లభించింది. ఈ కార్యక్రమం అతని క్రికెట్ ప్రయాణంతో పాటుగా అతని కెరీర్‌పై సమగ్ర సమాచారం అందించింది. క్రీడాకారులు పనితీరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనేది కూడా తెలుసుకునే అవకాశమూ కల్పించింది.

Marnus Labuschagne: టెస్టు క్రికెట్లో దూసుకుపోతున్న మార్నస్.. 5 ఏళ్లలో అతడిని మించిన బ్యాటర్ లేడు..

ఈ కార్యక్రమంలో శివమ్ మాట్లాడుతూ, పరిమ్యాచ్ స్పోర్ట్స్ దుస్తులు చాలా ఆసక్తిగా, స్టైలిష్‌గా ఉన్నాయని.. మంచి స్టైల్‌ని మెచ్చుకునే వ్యక్తిగా, తాను వీటిని విపరీతంగా అభిమానిస్తున్నానని వెల్లడించారు. దీనితో పాటుగా, తన అభిమానులతో సందేశాలను పంచుకోటంతో పాటుగా ఔత్సాహిక అథ్లెట్లకు విలువైన సలహాలను అందించారు.

EOSS: ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ సీజన్ ముగింపు సేల్ తిరిగి వచ్చేసింది

ముంబైలో జన్మించిన శివమ్ దూబే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు సంపూర్ణ సహకారం అందించి తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్, వైవిధ్యమైన మీడియం పేసర్‌గా అసాధారణమైన నైపుణ్యం ప్రదర్శిస్తూ, శివమ్ తన IPL కెరీర్‌లో ముఖ్యంగా తన బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శనలను ప్రదర్శించారు. CSK జట్టులో అంతర్భాగ సభ్యునిగా, అతను 11 ఇన్నింగ్స్‌లలో 411 పరుగుల స్కోర్‌ సాధించారు. ఈ సీజన్‌లో జట్టు విజయావకాశాలను మెరుగు పరచటం లో అతను కీలక పాత్ర పోషించారు.