పెరిగిన పెట్రోల్ ధరలు: పెట్రోల్‌పై రూ. 8.03, డీజిల్‌పై రూ. 8.27 పెంపు

దేశంలో వరుసగా 15వ రోజు(21 జూన్ 2020) కూడా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచేశాయి. లేటెస్ట్‌గా పెట్రోల్ ధర లీటరుకు 35 పైసలు, డీజిల్ ధర లీటరుకు 56 పైసలు పెరగడంతో గడిచిన 15 రోజుల్లో లీటర్ పెట్రోల్‌కు రూ.8.03 పైసలు, డీజిల్ రూ. 8.27 పైసలు మేర పెరిగాయి.
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.70 పైసలు ఉండగా, డీజిల్ ధ రూ. 76.11 పైసలుకు చేరింది. ఇక లీటర్ పెట్రోల్ ధర చెన్నైలో రూ.82.27 పైసలు, ఢిల్లీలో రూ. 78.88 పైసలు, కోల్‌కతాలో రూ. 80.62 పైసలు, హైదరాబాద్‌లో రూ.81.88 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ ధర చెన్నైలో రూ.75.29 పైసలు, ఢిల్లీలో రూ. 77.67 పైసలు, కోల్‌కతాలో రూ. 73.07 పైసలు, హైదరాబాద్‌లో రూ.75.91 పైసలుగా ఉంది.
భారత్‌లో పెట్రోల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారు?
ముడి చమురు ధరలు, రీఫైనరీల ఖర్చు, మార్కెటింగ్ కంపెనీల మార్జిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్, వ్యాట్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇవన్నీ కలిపిన తర్వాతే అది సామాన్యుడు భరించాల్సిన రిటైల్ ధర అవుతుంది.
ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా, పన్నులు ఎక్కువగా ఉంటే, రిటైల్ ధరలు కూడా ఎక్కువ ఉంటాయి.
Read: చెప్పిన టైం కంటే ముందే చేశాం.. అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ : ముఖేష్ అంబానీ