PF Money Withdraw : ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో పీఎఫ్ కొత్త రూల్స్.. రిటైర్ కాకముందే PF ఖాతాలో మొత్తం డబ్బులు తీసుకోవచ్చు..!

PF Money Withdraw : పీఎఫ్ ఖాతాదారులు త్వరలో తమ పీఎఫ్ అకౌంట్ నుంచి మొత్తం డబ్బులను రిటైర్మెంట్ కాకముందే విత్‌డ్రా చేసుకోవచ్చు.. అది ఎలాగంటే?

PF Money Withdraw

PF Money Withdraw : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) కొత్త రూల్స్ ప్రవేశపెట్టబోతుంది. పీఎఫ్ అకౌంట్ విత్‌డ్రా (PF Money Withdraw) విషయంలో కొత్త నిబంధనలను అమలు చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది. అదేగానీ జరిగితే.. ఇకపై ఉద్యోగులు ఎవరైనా తమ అవసరాలకు అనుగుణంగా PF అకౌంట్ నుంచి ఎక్కువ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్రస్తుతం, అనారోగ్య చికిత్స, ఇల్లు కొనడం, పిల్లల విద్య లేదా వివాహం వంటి కొన్ని కారణాల వల్ల మాత్రమే PF నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంటే.. ఒక నిర్దిష్ట పరిమితి కన్నా ఎక్కువ మొత్తంలో పీఎఫ్ అకౌంటును డబ్బులను విత్ డ్రా చేసుకోలేరు. 10ఏళ్ల సర్వీసు తర్వాత పీఎఫ్ అకౌంటులో మొత్తం పెన్షన్ రూపంలో పొందవచ్చు.

కొత్త ప్రతిపాదన ఏంటి? :
దీని ప్రకారం.. ఒక ఉద్యోగి 10 ఏళ్లు నిరంతరం పనిచేస్తే.. ఒకేసారి తన PF అకౌంట్ నుంచి పెద్ద మొత్తాన్ని (60శాతం నుంచి 70శాతం వరకు) విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

3సార్లు విత్‌డ్రా చేయొచ్చు :
ఈ కొత్త రూల్ ద్వారా ఒక ఉద్యోగి తన మొత్తం ఉద్యోగ కాలంలో మూడుసార్లు మాత్రమే పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేసుకోగలరు. ఎవరైనా 25 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మొదలుపెడితే.. అప్పుడు 35 ఏళ్ల నుంచి 45ఏళ్లు, 55 ఏళ్ల వయస్సులో ఈ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.

Read Also : iPhone 16 vs iPhone 16e : కొత్త ఐఫోన్ కావాలా? అతి చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16e కొనేసుకోవచ్చు.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

కొత్త రూల్స్ ఏంటి? :
ప్రస్తుతం పీఎఫ్ అకౌంటులో జమ చేసిన డబ్బులో ఎక్కువ భాగాన్ని ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత లేదా 58 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ తర్వాత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఎవరికి ప్రయోజనమంటే? :
ఈపీఎఫ్ఓ (ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)లో దాదాపు 7.5 కోట్ల (7.5 కోట్ల) ఉద్యోగులు-ఖాతాదారులు ఈ కొత్త రూల్ వల్ల భారీగా ప్రయోజనం పొందవచ్చు. అవసరమైనప్పుడు ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాదారులు అవసరమైనప్పుడల్లా అడపాదడపా అకౌంట్ నుంచి భారీ మొత్తాలను విత్‌డ్రా చేయకూడదు. ఇలా చేస్తే.. రిటైర్మెంట్ సమయంలో తమ ఖాతాలో తక్కువ వడ్డీ డబ్బు మాత్రమే ఉంటుంది.

చక్రవడ్డీ బెనిఫిట్స్ కోల్పోతారు :
పీఎఫ్ అకౌంటులో డబ్బు ఎంతకాలం ఉంచితే దానిపై భారీ వడ్డీని పొందవచ్చు. ఒకవేళ మధ్యలో డబ్బును విత్‌డ్రా చేస్తే చక్రవడ్డీ ప్రయోజనం తగ్గుతుంది. అంటే.. డిపాజిట్ చేసిన డబ్బు అంత వేగంగా పెరగదు. పీఎఫ్ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్రస్తుతం మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కానీ, ఇలా చేయడం వల్ల రిటైర్మెంట్ సమయంలో మీ అకౌంటులో తక్కువ డబ్బు మాత్రమే పొందుతారు. మీకు వడ్డీ ప్రయోజనం కూడా భారీగా తగ్గుతుంది. అందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలి.

ఆన్‌లైన్‌లో PF నుంచి క్యాష్ విత్‌డ్రా చేయాలంటే?:

1. లాగిన్ (Login) : ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ (www.epfindia.gov.in/) విజిట్ చేయండి.
మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
2. Update KYC : మీ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు UANతో లింక్, వెరిఫికేషన్ చేసి ఉండాలి.
3. ఫారమ్‌ను ఎంచుకోండి : ఆన్‌లైన్ సర్వీసెస్ సెక్షన్‌కు వెళ్లి సరైన ఫారమ్‌ను ఎంచుకోండి ( ఫారమ్ 31, కొంత మాత్రమే విత్‌డ్రా, ఫారమ్ 19 ఫారమ్ మొత్తం విత్‌డ్రా కోసం).
4. వివరాలను నింపండి : విత్ డ్రా ఎందుకు చేస్తున్నారు ఎంత మొత్తాన్ని (ఫారమ్ 31 కోసం) అనేది ఈ ఫారమ్‌లో ఎంటర్ చేయండి.
5. Submit : ‘Apply’పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది.
6. క్యాష్ క్రెడిట్ టైమ్ : మీ డబ్బు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు 15 రోజుల నుంచి 20 రోజుల్లోగా క్రెడిట్ అవుతుంది.