iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఈ ఆరెంజ్ కలర్ వేరియంట్ కొంటున్నారా? ఫస్ట్ ఇది చదివాకే కొనేసుకోండి!
iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొంటున్నారా? ఆరెంజ్ కలర్ వేరియంట్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే. ఇప్పుడే కొనేసుకోండి.

iPhone 17 Pro Price Offer
iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇటీవలే ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్లలో ఐఫోన్ 17 ప్రో అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అయితే, ఈ ఐఫోన్ మోడల్ ఆరెంజ్ కలర్ వేరియంట్ ఎక్కువగా అమ్ముడవుతోంది. ఐఫోన్ ప్రియులు ఈ ఐఫోన్ మోడలే ఎక్కువ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో అదే కలర్ ప్రో వేరియంట్ అందుబాటులో ఉంది. మీరు ఆరెంజ్ కలర్ ఐఫోన్ 17 ప్రో లేదా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనేందుకు చూస్తుంటే ఈ కిర్రాక్ ఆఫర్ అసలు వదులుకోవద్దు. మాక్‌రూమర్స్ నివేదిక ప్రకారం.. ఈ ఐఫోన్ 17 ప్రో కలర్ వేరియంట్ నార్మల్ కలర్ నుంచి రెడ్-గోల్డ్ లేదా ఆరెంజ్ కలర్‌లోకి మారుతోంది.
ఐఫోన్ 17 ప్రో ఆరెంజ్ వేరియంట్ డిస్కోలరేషన్ :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కేస్ కలర్ మార్పునకు సంబంధించి నివేదిక వెలుగులోకి వచ్చింది. అనోడైజ్డ్ అల్యూమినియం ఫ్రేమ్ కేసు కారణంగా కలర్ మారినట్టుగా కనిపిస్తోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఎలాంటి కారణం లేకుండా పింక్ కలర్‌కు మారిపోయిందని యూజర్లు అంటున్నారు.
రెడ్డిట్ పోస్టుల ప్రకారం.. ఇతర వేరియంట్‌లు కూడా కలర్ మారుతాయని సూచించాయి. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మొత్తం కాస్మిక్ ఆరెంజ్ స్కీమ్‌తో పోలిస్తే.. బ్రైట్ కెమెరా ఐలాండ్ కలర్ కలిగి ఉందని సూచించింది. ఐఫోన్ అసలు ఆపిల్ క్లియర్ కేసు సాధారణ కలర్ ఉండగా పెరాక్సైడ్ ఆధారిత లిక్విడ్ ఐఫోన్‌పై అప్లయ్ చేయడంతో కలర్ మారుతున్నాయని సూచించాయి.
ఆపిల్ సపోర్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. ’70 శాతం ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ వైప్, 75 శాతం ఇథైల్ ఆల్కహాల్ వైప్ లేదా క్లోరోక్స్ డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ ద్వారా ఐఫోన్ సున్నితంగా తుడవవచ్చు. బ్లీచ్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రొడక్టులను వాడొద్దు.
ఏదైనా లిక్విడ్ ఫోన్ హోల్స్‌లో హోల్స్‌లో తేమ రాకుండా చెక్ చేసుకోవాలి. మీ ఐఫోన్ ఏ క్లీనింగ్ ఏజెంట్లలో ముంచవద్దు. యాంటీ సెప్టిక్ క్రీమ్ రాసిన తర్వాత కొద్దిగా తడిగా ఉన్న మెత్తటి బట్టతో తుడవాలి. ఇప్పటివరకు ఆపిల్ ఈ కలర్లు మార్చే కేసులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.