PM Kisan 20th installment
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ రైతులు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అతి త్వరలో పీఎం కిసాన్ 20వ విడత విడుదల కానుంది.
Read Also : Aadhaar Update : మీ ఆధార్ ఇంకా అప్‌డేట్ చేయలేదా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. ఎలా చేయాలి? ఎక్కడంటే?
మీరు ఇప్పటికే, పీఎం కిసాన్ యోజనతో రిజిస్టర్ అయి ఉంటే.. 20వ విడత మీకు అందుతుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రూ. 2వేలు విడుదల చేయనుంది.
ఈ విడత రూ.2వేల డబ్బులు రైతుల ఖాతాల్లోకి నేరుగా పడతాయి. తద్వారా దాదాపు 10 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.
కేంద్ర ప్రభుత్వం జూన్ మొదటి వారంలో రైతుల అకౌంట్లలో రూ. 2వేలు పడనున్నాయి. గత ఫిబ్రవరి 24న 19వ విడత కింద రూ. 2వేలు విడుదల అయ్యాయి.
అయితే, ప్రభుత్వం ఇంకా అధికారికంగా 20వ విడత తేదీని ప్రకటించలేదు. కేవలం కొన్ని మీడియా నివేదికల ఆధారంగా ఊహాగానాలు మాత్రమేనని గమనించాలి.
20వ విడత ఎప్పుడు వస్తుందంటే? :
కొన్ని నివేదికల ప్రకారం.. వచ్చే జూన్ 7 2025 నాటికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ వాయిదాను పొందాలంటే ప్రతి లబ్ధిదారు రైతు e-KYCతో పాటు భూమి ధృవీకరణ తప్పనిసరిగా పూర్తి చేయాలి. మీ చిన్న పనులను ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. లేదంటే రావాల్సిన వాయిదా రూ. 2వేలు పడవు.
ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం ప్రతి ఏడాదిలో రూ.6వేలు 3 విడతలుగా రూ.2వేలు చొప్పున బ్యాంకు అకౌంటులో క్రెడిట్ అవుతుంది. ప్రతి విడతకు 4 నెలలు సమయం ఉంటుంది.
ఇప్పటివరకు, పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకూ 19 విడతల్లో డబ్బులు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :