PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ఈ ఒక్క పని పూర్తి చేయకపోతే రూ. 2వేలు పడవు.. మీరు చేశారో లేదో చెక్ చేసుకోండి!

PM Kisan 20th installment : పీఎం కిసాన్ యోజన కింద 20వ విడత విడుదల కానుంది. కానీ, e-KYC పూర్తి చేయకపోతే.. మీ వాయిదా నిలిచిపోయే అవకాశం ఉంది.

PM Kisan 20th installment

PM Kisan 20th installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, దేశంలో ప్రస్తుతం అనేక పథకాలు అమలులో ఉన్నాయి. మీరు ఏదైనా ప్రభుత్వ పథకానికి అర్హులైతే, ఆ పథకంలో చేరడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

Read Also : Volkswagen Taigun GT : కొత్త కారు కొంటున్నారా? వోక్స్‌వ్యాగన్ టైగన్ GTపై ఏకంగా రూ. 2.5 లక్షల భారీ డిస్కౌంట్‌.. అదిరిపోయే డీల్..!

వాస్తవానికి, ఈ పథకం కింద రైతులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయి. మీరు కూడా ఈ పథకానికి అర్హత కలిగిన రైతు అయితే మీరే దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఏటా రూ. 6 వేలు అందుతాయి.

ఈ డబ్బు ఒక్కొక్కటి రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో అందుతుంది. కానీ, ఈ పథకానికి సంబంధించిన పనిని పూర్తి చేయకపోతే మీ వాయిదా నిలిచిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఏ పనిని పూర్తి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.

మీరు కూడా పీఎం కిసాన్ యోజనకు అర్హత కలిగి ఉంటే e-KYC పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ పని పూర్తి చేయకపోతే మీ వాయిదా నిలిచిపోవచ్చు. వాయిదాలను పొందడానికి రైతులు e-KYC చేయించుకోవడం తప్పనిసరి అని ఇప్పటికే స్పష్టం చేసింది.

e-KYC ఎలా పూర్తి చేయాలి? :
మొదటి పద్ధతి :
మీరు ఇంకా e-KYC చేయకపోతే వీలైనంత త్వరగా పూర్తి చేయండి. లేకుంటే తదుపరి వాయిదాలను విడుదల పొందలేరు. మీ సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లి e-KYC పూర్తి చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ఆధారిత e-KYC పూర్తి చేయించుకోవాలి.

రెండో పద్ధతి :
మీరు CSC కేంద్రానికి వెళ్లకపోతే.. మీరే e-KYC చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)ని విజిట్ చేయాలి లేదా మీరు అధికారిక కిసాన్ యాప్‌ను కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి OTP ఆధారిత e-KYC చేయవచ్చు.

Read Also : Broadband Plan : 400Mbps, 22 OTT యాప్స్, 300కి పైగా టీవీ చానళ్లు.. సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మీకోసం..!

ఈ పనులు పూర్తి చేయండి :
e-KYC కాకుండా, అవసరమైన కొన్ని ఇతర పనులు కూడా పూర్తి చేయాలి. ఇందులో మొదటి పని మీ ల్యాండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. భూమి ధృవీకరణతో పాటు మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాలి. ఆధార్ లింక్ కోసం మీ బ్యాంకు హోం బ్రాంచ్‌కు వెళ్లాలి.