Volkswagen Taigun GT : కొత్త కారు కొంటున్నారా? వోక్స్‌వ్యాగన్ టైగన్ GTపై ఏకంగా రూ. 2.5 లక్షల భారీ డిస్కౌంట్.. అదిరిపోయే డీల్..!
Volkswagen Taigun GT : వోక్స్‌వ్యాగన్ టైగన్ GT కారుపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కొత్త కారు కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్.

Volkswagen Taigun GT
Volkswagen Taigun GT : కొత్త కారు కొంటున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ కంపెనీ తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా 2.5 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది.
2025లో కొత్త కారు కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం. మీరు కూడా వోక్స్‌వ్యాగన్ కంపెనీ అభిమాని అయితే.. ఈ డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. మీకు సమీపంలోని షోరూమ్‌కు వెళ్లి డిస్కౌంట్ గురించి సమాచారాన్ని ఓసారి చెక్ చేయండి.. ఈ కారు గురించి మరిన్ని వివరాలను ఓసారి లుక్కేయండి.
వోక్స్‌వ్యాగన్ టైగన్ GT డిస్కౌంట్ :
వోక్స్‌వ్యాగన్ కంపెనీ చాలా కాలంగా మార్కెట్‌ను శాసిస్తోంది. వోక్స్‌వ్యాగన్ ఈ నెలలో పాపులర్ మోడళ్లపై రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇప్పుడు మీకు ఇష్టమైన వోక్స్‌వ్యాగన్ కార్లలో ఏదైనా ఒక కారు కొనేసుకోవచ్చు.
కంపెనీ సెడాన్, స్పోర్ట్స్ లేదా ఎస్‌యూవీల వంటి కొత్త మోడల్ ధరను కూడా అందిస్తుంది. వోక్స్‌వ్యాగన్ టైగన్ SUV ప్రారంభ ధరను రూ. 79వేలు తగ్గించింది.
అంతేకాదు.. కంపెనీ SUVపై రూ. 2.5 లక్షల వరకు విలువైన బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ప్రతి వోక్స్‌వ్యాగన్ వినియోగదారులకు అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.
వోక్స్‌వ్యాగన్ టైగన్ GT ఇంజిన్ :
వోక్స్‌వ్యాగన్ కార్లను దగ్గరగా చూడాలి. కంపెనీ 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇంజిన్ అన్ని రైడింగ్‌లకు సరిపోతుంది.
వేగంగా, నెమ్మదిగానే కాకుండా కొండ ప్రాంతంలో లాంగ్ డ్రైవ్ చేసేందుకు ఈ కారు బెస్ట్ ఆప్షన్. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు లేదా 7 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది.
వోక్స్‌వ్యాగన్ టైగన్ GT సేఫ్టీ ఫీచర్లు :
వోక్స్‌వ్యాగన్ కారులో అన్ని డిజిటల్ ఫీచర్లు, డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేను అందిస్తుంది. మసాజ్ ఆప్షన్లలో వెంటిలేటెడ్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ లెవల్ 3 అడాస్ సిస్టమ్ సైడ్ ప్రొఫైల్ అల్లాయ్ వీల్స్ విత్ యాంటీలాగ్ బ్రేక్ సిస్టమ్ లాంటివి ఈ కారులో అన్ని ఫీచర్లను అందిస్తుంది. కంపెనీ సేఫ్టీ ఫీచర్‌ను కూడా అందిస్తోంది.