8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు ఎంత పెరగనున్నాయంటే?
8th Pay Commission : కొత్త 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. భారత ప్రభుత్వం 8వ వేతన సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఉద్యోగుల వేతనాలపై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల దృష్టి, జీతం పెరుగుదల, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉంటుంది. ఈసారి, ఉద్యోగి సంస్థలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 రెట్లు పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Read Also : Samsung Galaxy F06 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. రూ. 10వేల లోపు ధరకే ఈ 5G ఫోన్ కొనేసుకోండి..!
ఇదే జరిగితే.. ఉద్యోగుల కనీస వేతనం రూ. 51,480కి చేరుకుంటుంది. పెన్షన్ రూ. 25,740కి చేరుకుంటుంది. కానీ, ఇందులో చాలా సవాళ్లు ఉన్నాయి.
అధిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కారణంగా మాత్రమే జీతం భారీగా పెరగాల్సిన అవసరం లేదు. ఇంతకీ, ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఉద్యోగుల జీతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరంగా తెలుసుకుందాం.
ఉద్యోగుల కనీస జీతం ఎలా నిర్ణయిస్తారంటే? :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వం ఉద్యోగుల (8th Pay Commission) జీతం పెంపునకు లెక్కిస్తారు. సాధారణంగా, ఉద్యోగుల కనీస వేతనం ప్రస్తుత కనీస జీతాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించడం ద్వారా లెక్కిస్తారు. అయితే, ఈ సిస్టమ్ అన్ని స్థాయిలలోని ఉద్యోగుల జీతాలకు సమానంగా వర్తించదు.
8వ వేతన కమిషన్‌లో ఉద్యోగి సంస్థలు 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. కానీ, లోతుగా పరిశీలిస్తే.. మునుపటి వేతన కమిషన్లలో అమలు చేసే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతాల పెంపును మనం పరిశీలించాలి.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో జీతం పెరుగుతుందా? :
కేంద్ర ప్రభుత్వం 6వ వేతన సంఘాన్ని అమలు చేయగా దాదాపు 1.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదం తెలిపింది. కానీ, ఆ సమయంలో, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగుల జీతం రికార్డు స్థాయిలో 54 శాతం పెరిగింది.
కానీ, 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయగా, ఉద్యోగుల కనీస జీతం కేవలం 14.2 శాతం మాత్రమే పెరిగింది.
దీని ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు వల్ల జీతంలో పెద్దగా పెరుగుదల ఉండదని స్పష్టమవుతోంది. ఈసారి ప్రభుత్వం 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసినప్పటికీ, ఉద్యోగుల ప్రాథమిక జీతం కూడా అదే నిష్పత్తిలో పెరగాల్సిన అవసరం లేదు. ఇతర ఆర్థిక అంశాలు కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇతర ముఖ్య విషయాలివే :
ఉద్యోగుల జీతం పెరుగుదల కేవలం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై మాత్రమే ఆధారపడి ఉండదు. ద్రవ్యోల్బణం రేటు, ఉద్యోగుల పనితీరు, దేశ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఖజానాపై భారం వంటి అనేక ఇతర ముఖ్యమైన అంశాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.
గత వేతన కమిషన్ల అనుభవం, తక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ, చాలా సార్లు ఉద్యోగులు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వేతనాల పెంపును పొందే అవకాశం ఉంటుంది.
ఈసారి కూడా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జీతంలో భారీ పెరుగుదల ఉంటుందని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.