PM Kisan 20th Installment
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ యోజన పథకం కింద 20వ విడత డబ్బులు కూడా విడుదల కానున్నాయి. గత ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 19వ విడతను రైతులకు విడుదల చేసింది.
19వ విడత తర్వాత ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే.. రాబోయే 20వ విడత జూన్ నాటికి రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 19వ విడత కింద రూ.22వేల కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రైతు లబ్ధిదారులలో 2.41 కోట్ల మంది మహిళలు కూడా ఉన్నారు.
20వ విడత ఎప్పుడు వస్తుందంటే? :
ఇప్పుడు రైతులు పీఎం కిసాన్ 20వ విడత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఏడాదికి 3 సార్లు 4 నెలల వ్యవధిలో డబ్బులు పడుతాయి. 2025 ఏడాదిలో రెండో విడత అంటే.. పీఎం కిసాన్ 20వ విడత జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత, మూడో విడత అక్టోబర్ 2025లో వచ్చే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దీనిపై అధికారిక తేదీని ప్రకటించనుంది.
పీఎం కిసాన్ స్కీమ్ ఏంటి? :
పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో ప్రారంభించింది. తద్వారా రైతుల ఆర్థిక అవసరాలను ప్రతి ఏటా తీరుస్తోంది. ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6వేల ఆర్థిక సాయం అందిస్తుంది. మూడు సమాన వాయిదాలలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది.
రైతులు తమ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ అవసరాలను తీర్చుకోవడంలో సాయం చేయడమే ఈ పథకం ఉద్దేశం. అంతేకాదు.. పీఎం కిసాన్ ఆర్థిక సాయంతో రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పటివరకు, ఈ పథకం కింద ప్రభుత్వం 18 విడతలుగా రూ.3.46 లక్షల కోట్లకు పైగా విడుదల చేసింది.
పీఎం కిసాన్ పథకం బెనిఫిట్స్ ఎలా పొందాలి?
ఈ పథకం ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు ముందుగా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి ద్వారా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? వెంటనే ఈ పని చేయండి.. అకౌంట్లలో డబ్బులు పడతాయి..!
రిజిస్ట్రేషన్ అవసరమైన డాక్యుమెంట్లు ఇవే :
పీఎం కిసాన్ పోర్టల్‌లో OTP ఆధారిత e-KYC పూర్తి చేయొచ్చు. బయోమెట్రిక్ ఈ-కెవైసీ కోసం రైతులు సీఎస్సీ కేంద్రాన్ని సందర్శించి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. తద్వారా రైతులు OTP లేదా ఫింగర్ ఫ్రింట్ లేకుండానే e-KYC పూర్తి చేయవచ్చు.