PM KISAN : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది అప్పుడే.. మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలంటే?

PM KISAN : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. అందిన సమాచారం ప్రకారం.. వచ్చే జూన్ రెండో వారంలో రూ. 2వేలు పంపిణీ చేసే అవకాశం ఉంది.

PM Kisan Yojana

PM KISAN : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది.

అంచనాల ప్రకారం.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం 20వ విడత విడుదల చేయనుంది. రూ. 2వేల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు, రైతులు 19 వాయిదాల ప్రయోజనాన్ని పొందారు.

Read Also : AP DSC Hall Tickets : ఏపీలో వాట్సాప్‌ ద్వారా మెగా DSC హాల్‌ టికెట్లు.. మంత్రి లోకేష్ సందేశం!

వ్యవసాయానికి ఆహారం, విత్తనాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, వాయిదా మొత్తాన్ని అందించే తేదీపై మోదీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

వాయిదా మొత్తాన్ని పొందాలంటే లబ్దిదారులు కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయాలి. లేదంటే రూ. 2వేలు మధ్యలోనే ఆగిపోతాయి.

రైతులు పేరును ఎలా చెక్ చేయవచ్చు? :

  • ముందుగా (https://pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో ‘Know Your Status’పై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత దయచేసి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
  • మీరు ‘Get Details’పై క్లిక్ చేయాలి.
  • 20వ విడత స్వీకరిస్తారో లేదో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • సులభంగా వివరాలను చెక్ చేయవచ్చు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ప్రతి ఏటా రూ.6వేలు 3 విడతలుగా రూ.2వేలు చొప్పున బదిలీ చేస్తోంది. ప్రతి విడతకు నాలుగు నెలల సమయం ఉంటుంది.

Read Also : BSNL Plan : BSNL అదిరే ప్లాన్.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా.. 90 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

19వ విడత ఫిబ్రవరి 24న విడుదల అయింది. అయితే, 20వ విడత డబ్బులు పొందాలంటే.. బ్యాంకు అకౌంటుతో మీ ఆధార్ కార్డును లింక్ చేయండి. e-KYC ప్రక్రియను పూర్తి చేయని రైతులు రూ. 2వేలు అందుకోలేరని గమనించాలి.