AP DSC Hall Tickets : ఏపీలో వాట్సాప్‌ ద్వారా మెగా DSC హాల్‌ టికెట్లు.. మంత్రి లోకేష్ సందేశం!

AP DSC Hall Tickets : మెగా డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ అభ్యర్థులకు సందేశాన్ని తెలియజేశారు.

AP DSC Hall Tickets : ఏపీలో వాట్సాప్‌ ద్వారా మెగా DSC హాల్‌ టికెట్లు.. మంత్రి లోకేష్ సందేశం!

AP DSC Hall Tickets

Updated On : May 31, 2025 / 7:32 PM IST

AP DSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. మెగా డీఎస్సీ (AP DSC Hall Tickets) హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా ఈజీగా డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే, దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ (http:// cse.ap.gov.in) ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది.

Read Also : Covid-19 Cases : భారత్‌లో కరోనా కల్లోలం.. 2,710కి పెరిగిన కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికం..!

ఇందుకోసం డీఎస్సీ అభ్య‌ర్థులు 95523 00009కు వాట్సాప్ సర్వీసు ద్వారా మెసేజ్ చేయాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ఇప్పుడు అభ్యర్థుల వంతు 
ఈ సందర్భంగా (AP DSC Hall Tickets) విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక సందేశాన్ని తెలియజేశారు. ‘మెగా డీఎస్సీ నిర్వహణ పట్ల మా నిబద్ధత నెరవేరింది. డీఎస్సీలో అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి.

ఇప్పుడు ఇక అభ్యర్థుల వంతు . డీఎస్పీ అభ్యర్థులకు మా శుభాకాంక్షలు. ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నా’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Read Also : Ayushman Bharat Card : ఆయుష్మాన్ భారత్ కార్డుతో కొవిడ్ ట్రీట్‌మెంట్.. రూ. 5 లక్షల వరకు ఫ్రీ.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

జూన్‌ 6 నుంచి జూన్ 30 వరకు మెగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గవర్నమెంట్ స్కూళ్లలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్‌ 20 నుంచి మే 15వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. అన్ని పోస్టులకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.