Vidya Lakshmi Scheme
Vidya Lakshmi Scheme : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎడ్యుకేషన్ లోన్ కోసం చూస్తున్నారా? అయితే, తక్కువ (Vidya Lakshmi Scheme) వడ్డీ అందించే బ్యాంకు ఒకటి ఉంది. మీ ఫ్యామిలీలో లేదా ఏ విద్యార్థి అయినా ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ ఈజీగా తీసుకోవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఈ అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. ప్రత్యేకించి విద్యార్థుల కోసం ‘విద్యాలక్ష్మి పథకం’ కింద ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది.
వడ్డీ రేట్లను బ్యాంక్ నేరుగా 0.20శాతానికి తగ్గించింది. ఇప్పుడు, ఈ పథకం కింద చదువులకు అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది.
ఉన్నత విద్యను సులభతరం చేసేందుకు విద్యాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పీఎన్‌బీ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. డబ్బు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థి చదువుకునే అవకాశాన్ని కోల్పోకూడదు.
భారత్‌లో 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో (QHEI) మెరిట్ ఆధారంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఈ బ్యాంకు తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఈ రుణం 7.5శాతం ప్రారంభ వడ్డీ రేటుతో పొందవచ్చు.
పూచీకత్తు లేకుండా రుణం :
విద్యార్థులు ఉన్నత చదువుల కోసం PNB విద్యాలక్ష్మి పథకాన్ని ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ రుణానికి ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఎలాంటి పూచీకత్తు కూడా అవసరం లేదు.
ఇందులో, విద్యార్థులకు వారి అవసరాన్ని బట్టి లోన్ అందిస్తారు. తద్వారా మొత్తం చదువు ఖర్చు కోసం వినియోగించుకోవచ్చు.
ఏ డాక్యుమెంట్లు అవసరమంటే? :
ఈ లోన్ తీసుకోవాలంటే.. విద్యార్థి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్‌తో సహా KYC వివరాలను అందించాలి. గత క్లాసు మార్క్ షీట్, ఆటో వెరిఫైడ్ కాపీ, ప్రవేశ పరీక్ష ఫలితాలు, కాలేజీ నుంచి పొందిన అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఏదైనా రుణం ఇంతకు ముందు తీసుకుంటే ప్రూఫ్ అందించాలి. కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరి.
Read Also : Moto Razr 60 Phone : భలే ఉంది భయ్యా.. మోటోరోలా మడతబెట్టే ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!
సబ్సిడీ ప్రయోజనాలివే :
PNB వెబ్‌సైట్ ప్రకారం.. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య ఉంటే.. టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులకు వడ్డీపై 100 శాతం సబ్సిడీ లభిస్తుంది.
ఇతర కోర్సులకు 3శాతం వడ్డీ సబ్సిడీ అందిస్తారు. తక్కువ వడ్డీ చెల్లించాలి. లోన్ తీసుకోవడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.