Poco C75 Launch : అద్భుతమైన కెమెరాలతో పోకో C75 ఫోన్ వచ్చేసింది.. కేవలం ధర రూ.10వేల లోపు మాత్రమే!
Poco C75 Launch : పోకో సి75 మీడియాటెక్ హెలియో జీ8 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 50ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది.

Poco C75 With 50-Megapixel Rear Camera ( Image Source : Google )
Poco C75 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ షావోమీ అనుబంధ కంపెనీ పోకో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. సరసమైన ధరలో పోకో C75 స్మార్ట్‌ఫోన్‌గా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ రెడ్‌మి 14సి రీబ్రాండెడ్ వెర్షన్. కంపెనీ ఆగస్టులో ఈ ఫోన్ ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్‌తో అనేక స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది.
పోకో సి75 మీడియాటెక్ హెలియో జీ8 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 50ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,160mAh బ్యాటరీని అందిస్తుంది. షావోమీ హైపర్ఓఎస్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.
పోకో సి75 ధర, లభ్యత :
పోకో సి75 ఫోన్ 6జీబీ+128జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర 109 డాలర్లు (దాదాపు రూ. 9,170) నుంచి ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 8జీబీ+256జీబీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ పోకో వేరియంట్ ధర 129 డాలర్లు (దాదాపు రూ. 10,900) నుంచి అందుబాటులో ఉంది. పోకో ‘ఎర్లీ బర్డ్’ ధరలుగా పేర్కొంది. పోకో సి75 ఫోన్ బ్లాక్, గోల్డ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
పోకో సి75 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
పోకో సి75 అనేది డ్యూయల్-సిమ్ (నానో+నానో) స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ఓఎస్, షావోమీ కస్టమ్ ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. ఎంఐయూఐ 14 తర్వాత వచ్చింది. పోకో ఫోన్‌లో 120Hz రిఫ్రెష్‌తో 6.88-అంగుళాల హెచ్‌డీ+ (720×1,640 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. రేటు, గరిష్ట ప్రకాశం స్థాయి 600నిట్స్ కలిగి ఉంది. మీడియాటెక్ నుంచి హెలియో జీ81 అల్ట్రా ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. పోకో సి75లో ఎఫ్/1.8 ఎపర్చరుతో 50ఎంపీ బ్యాక్ కెమెరా ఉంది. ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసేందుకు ఉపయోగించవచ్చు. కంపెనీ హ్యాండ్‌సెట్‌లో సహాయక లెన్స్‌ను కూడా అమర్చింది. ఫ్రంట్ సైడ్ హ్యాండ్‌సెట్ ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 13ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఇ-కంపాస్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్‌తో కూడా అమర్చి ఉంటుంది. పోకో సి75 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,160mAh బ్యాటరీని అందిస్తుంది. అయితే, పోకో ఫోన్ ఛార్జర్‌తో రాదు. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అంతేకాకుండా, 171.88×77.8×8.22ఎమ్ఎమ్ పరిమాణం, 204గ్రాముల బరువు ఉంటుంది.