Post Office Schemes
Post Office Scheme : పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన పథకం.. రిటైర్మెంట్ తర్వాత కూడా భారీగా ఆదాయాన్ని పొందవచ్చు. మీ కోసం లేదా వృద్ధాప్యంలో (Post Office Scheme) మీ తల్లిదండ్రుల కోసం సురక్షితమైన గ్యారెంటీ ఆదాయాన్ని పొందవచ్చు.
పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పథకం ద్వారా డబ్బును సురక్షితంగా పొందవచ్చు. బ్యాంక్ FD కన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. ఈ పథకంలో 5 భారీ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి నెలా రూ. 20,500 ఆదాయాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వంద శాతం సురక్షితమైన పెట్టుబడి.. :
రిటైర్మెంట్ తర్వాత చాలామంది తమ డబ్బును పూర్తిగా సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఏదైనా పోస్టాఫీసులో లేదా ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకులో అధీకృత శాఖలో ఓపెన్ చేయొచ్చు. మీ డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. మీ అసలు, వడ్డీ రెండింటికీ పూర్తి హామీ ఇస్తుంది.
బ్యాంక్ FD కన్నా అధిక రాబడి :
సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్లలో SCSS పథకం ఒకటి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ పథకం అత్యధిక వడ్డీ చెల్లించే పథకాలలో ఒకటి. సాధారణంగా బ్యాంకులు అందించే 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) కన్నా చాలా ఎక్కువే. వడ్డీ రేటు 8.2శాతంగా పొందవచ్చు. పెట్టుబడి తర్వాత వడ్డీ రేటు మొత్తం 5 ఏళ్లకు లాక్ అయి ఉంటుంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ 5 ఏళ్ల పాటు అదే అధిక రేటుతో వడ్డీని పొందవచ్చు.
ప్రతి నెలా గ్యారెంటీడ్ ఇన్‌కమ్ :
పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ (SCSS)లో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం, 8.2 శాతం వార్షిక వడ్డీ పొందవచ్చు. ఈ పథకంలో ప్రతి 3 నెలలకు వడ్డీ పొందవచ్చు.
ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, జనవరి 1 తేదీలలో మీ అకౌంటుకు వడ్డీ వస్తుంది. వడ్డీ మొత్తం అదే పోస్టాఫీస్‌లోని మీ సేవింగ్స్ అకౌంటులో జమ అవుతుంది. ఖాతాదారుడు వడ్డీ మొత్తాన్ని విత్ డ్రా చేయకపోతే ఇలాంటి వడ్డీపై అదనపు వడ్డీ పొందవచ్చు.
నెలకు రూ. 20,500 సంపాదన :
ఈ పోస్టాఫీసు పథకంలో రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 8.2 శాతం రేటుతో వార్షిక వడ్డీ రూ.2,46,000 లభిస్తుంది. ఈ పథకం కింద వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన అందుతుంది. 3 నెలలుగా విభజిస్తే.. రూ.61,500 అవుతుంది. ప్రతి 3 నెలలకు రూ.61,500 మీ అకౌంటులో జమ అవుతుంది. అంటే.. నెలవారీ ప్రాతిపదికన ఆదాయం రూ.20,500 సంపాదించుకోవచ్చు.
పన్ను మినహాయింపు, రెట్టింపు బెనిఫిట్స్ :
ఈ పోస్టాఫీసు పథకం ద్వారా మంచి ఆదాయమే కాదు.. పన్ను ఆదా కూడా చేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
పెట్టుబడి ఎలా? ఎవరు పెట్టొచ్చు? :
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడైనా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. VRS (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకున్న వారు 55 ఏళ్ల వయస్సులో కూడా (రిటైర్మెంట్ తర్వాత ఒక నెలలోపు) అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. డిఫెన్స్ సర్వీసు నుంచి రిటైర్మెంట్ చేసిన ఉద్యోగులు 50 ఏళ్ల వయస్సులో కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.