Aadhaar Card Update : UIDAI కొత్త రూల్స్.. ఇకపై ఆధార్ కార్డు అప్‌డేట్ చేస్తే.. ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి.. కొత్త లిస్ట్ ఇదిగో..!

Aadhaar Card Update : ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలా? ఆధార్ అప్‌డేట్ కోసం కొత్త డాక్యుమెంట్ల జాబితాను UIDAI రిలీజ్ చేసింది.

Aadhaar Card Update : UIDAI కొత్త రూల్స్.. ఇకపై ఆధార్ కార్డు అప్‌డేట్ చేస్తే.. ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి.. కొత్త లిస్ట్ ఇదిగో..!

Aadhaar Card Update

Updated On : July 9, 2025 / 1:34 PM IST

Aadhaar Card Update : మీకు ఆధార్ కార్డు ఉందా? లేదా కొత్త ఆధార్ కార్డు కోసం చూస్తున్నారా? మీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలా? పాత ఆధార్‌లో (Aadhaar Card Update) పేరు, ఇంటి అడ్రస్ లేదా ఫొటోను మార్చాలనుకుంటే కొత్త రూల్స్ తప్పక గుర్తుంచుకోండి. 2025-26 సంవత్సరానికి ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) విడుదల చేసింది.

ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ కార్డులంటే ఎలా? :
ఒకరి పేరు మీద పొరపాటున 2 లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లు జనరేట్ అయితే.. మొదట జారీ చేసిన ఆధార్ నంబర్ మాత్రమే వ్యాలీడ్ అవుతుందని UIDAI స్పష్టం చేసింది. మిగతా అన్ని ఆధార్ నంబర్లు రద్దు అవుతాయి.

ఆధార్ కోసం 4 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవే :
1. ఐడెంటిటీ ప్రూఫ్ : మీరు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ (ఈ-పాన్ కార్డ్), ఓటరు ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫొటో ఐడెంటిటీ కార్డు, NREGA జాబ్ కార్డ్, పెన్షనర్ గుర్తింపు కార్డు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం/మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం కార్డు, ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డులను డాక్యుమెంట్లుగా చూపించవచ్చు.

2. అడ్రస్ ప్రూఫ్ : అడ్రస్ ప్రూఫ్ కోసం విద్యుత్/నీరు/గ్యాస్/ల్యాండ్‌లైన్ బిల్లు (3 నెలల కన్నా తక్కువ వయస్సు), బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రెంట్ అగ్రిమెంట్ (రిజిస్టర్డ్), పెన్షన్ డాక్యుమెంట్, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు.

3. బర్త్ సర్టిఫికేట్ : స్కూల్ మార్క్ షీట్, పాస్‌పోర్ట్, డేట్ ఆఫ్ బర్త్‌తో పెన్షన్ డాక్యుమెంట్, పుట్టిన తేదీతో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు.

Read Also : Jio Mutual Fund : గుడ్ న్యూస్.. ఇకపై మ్యూచువల్ ఫండ్లలో జియో ఫైనాన్స్ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

4. ప్రూఫ్ ఆఫ్ రిలేషన్‌షిప్ (అవసరమైతే) :

కొత్త రూల్స్ వల్ల ఎవరికి (Aadhaar Card Update) సమస్యలంటే? :
– భారత పౌరులు
– ఎన్నారైలు
– 5 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు
– దీర్ఘకాలిక వీసాపై భారత్‌లో నివసిస్తున్న విదేశీయులు

విదేశీయులు, OCI కార్డుదారులు తమ పాస్‌పోర్ట్, వీసా, పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా FRRO రెసిడెన్సీ పర్మిట్ చూపించాల్సి ఉంటుంది.

ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేయండి :
ఆధార్ కార్డులో (UIDAI) 14 జూన్ 2026 వరకు ఫ్రీ ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ సౌకర్యాన్ని అందించింది.
1. myAadhaar పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
2. అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.
3. బయోమెట్రిక్ లేదా OTPతో వెరిఫై చేసుకోండి.
4. అప్‌డేట్ తర్వాత ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.