Property Purchase: ఇల్లు కొనేటప్పుడు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

కలల ఇంటిని కొంటున్నప్పుడు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ ఎస్టేట్‌ రంగ నిపుణులు. ఇంటితో పాటు మరి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

property purchase precautions: సామాన్య, మధ్యతరగతి నుంచి మొదలు ప్రతి ఒక్కరు తమకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. ఎవరి బడ్జెట్ కు అనుకునంగా, వారికి నచ్చిన ప్రాంతంలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంటారు. చాలా మంది పైసా పైసా కూడబెట్టి, బ్యాంకు రుణాలు తీసుకుని ఇంటిని కట్టుకోవడమే, కొనుక్కోవడమో చేస్తుంటారు. మరి కలల ఇంటిని కొంటున్నప్పుడు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ ఎస్టేట్‌ రంగ నిపుణులు. మరీ ముఖ్యంగా సొంతిల్లు కొనుక్కునే సమయంలో ఇంటితో పాటు మరి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

కొనుగోలుదారుల వైఖరిలో స్పష్టమైన మార్పు
ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఇంటి కొనుగోలుదారుల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఇంటి ధర ప్రాధాన్యంగా ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు, ఇప్పుడు వసతులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ఇంటి ధర, సౌకర్యాలే కాకుండా ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతుననారు. ఆఫీసులు, హాస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్ ఇంటికి ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

పచ్చదనం ఉండాలి
కేవలం ఇల్లు విశాలంగా ఉండటమే కాకుండా, కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పిల్లల కోసం స్పోర్స్ట్ జోన్స్, పెద్దలకు క్లబ్‌ హౌస్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. మొత్తం కమ్యూనిటీలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం ఉన్న ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనా, పాలనా చూసే డే కేర్‌ సౌకర్యాలు ఉండే కమ్యూనిటీలైతే మరింత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఆఫీస్‌కు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్‌ సదుపాయాలు ఉన్నాయా అన్నది చూసుకోవాలని అడ్వైజ్ చేస్తున్నారు.

Also Read: సొంతిల్లు కొనేందుకు ఇదే సరైన సమయం.. ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశం

ఆఫీసు దగ్గరలో ఉంటే బెటర్..
ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు, లేదంటే పని చేసే ప్రాంతానికి ఎంత దూరంలో ఉందనేది కొనుగోలుదారులు బేరీజు వేసుకుంటారు. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృధా అవుతుంది. కాబట్టి దూరం, సమయం అనేది ప్రధాన అంశాలుగా మారాయి. అందుకే ప్రజా రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలని రియల్ ఎస్టేట్‌ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీకెండ్‌ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్‌ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు