Rail Neer Prices : రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఇక చౌకైన ధరకే ‘రైల్ నీర్’ కొనేసుకోవచ్చు.. లీటర్ బాటిల్ ధర ఎంతంటే?

Rail Neer Price : రైల్ నీర్ ధర తగ్గిందోచ్.. ఇకపై ప్రయాణీకులు లీటర్, అర లీటర్ చౌకైన ధరకే కొనొచ్చు. కొత్త ధరలు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే?

Rail Neer Prices

Rail Neer Price : రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. రైల్ నీర్ ధరలు తగ్గాయి. ప్లాట్‌ఫామ్‌లపై, రైళ్లలో లభించే రైల్ నీర్‌ ధరలను భారత రైల్వే భారీగా తగ్గించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. రైల్ నీర్ బాటిళ్లు ఇప్పుడు చౌకగా లభ్యం కానున్నాయి.

గతంలో, ప్రయాణీకులు ఒక లీటర్ బాటిల్‌కు రూ. 15 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు (Rail Neer Price) అదే బాటిల్‌ను కేవలం రూ. 14కు పొందవచ్చు. అదేవిధంగా, హాఫ్ లీటర్ బాటిల్ ఇప్పుడు రూ. 9కు లభిస్తుంది. గతంలో ఈ బాటిల్ ధర రూ. 10 రూపాయలు ఉండేది. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి.

కొత్త జీఎస్టీ రేట్లతో చౌకగా రైల్ నీర్ :
సెప్టెంబర్ 22 నుంచి కొత్త GST విధానం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో రైల్ నీర్ ధరలను తగ్గిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్వీట్‌లో తెలిపింది. “తగ్గించిన జీఎస్టీ ప్రత్యక్ష ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు రైల్ నీర్ గరిష్ట అమ్మకపు ధరను లీటరుకు రూ. 15 నుంచి రూ. 14కు, అర లీటరుకు రూ. 10 నుంచి రూ. 9 కు తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో తెలిపింది.

రైల్వే కీలక నిర్ణయం, ప్రయాణికులపై తగ్గిన భారం :
ప్రయాణీకులపై భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రైల్వేల ప్రకారం.. ప్రతి ఏడాది లక్షలాది మంది రైల్ నీర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ చిన్న మార్పుతో లక్షలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. చాలా దూరం ప్రయాణించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త రేట్లతో బాటిళ్ల నీరు క్వాలిటీ, స్వచ్ఛతపై ఎలాంటి ప్రభావం ఉండబోదని రైల్వేలు పేర్కొన్నాయి. ప్రయాణీకుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.

Read Also : Flipkart Big Billion Days Sale : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా ఆర్డర్ చేయండి.. ఆపిల్ ఐఫోన్ 17 కేవలం 10 నిమిషాల్లోనే హోం డెలివరీ..!

రైల్ నీర్ ధరను తగ్గించాలని చాలా కాలంగా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. బయటి నుంచి నీటిని కొనుగోలు చేయడం వల్ల తరచుగా నకిలీ బాటిళ్లు లేదా అధిక ధరకు నీరు లభిస్తుందని వాపోతున్నారు. రైల్వేలు తమకు నమ్మకమైన నీటిని అందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా రైల్ నీర్ బాటిల్ ధరలను తగ్గించాయి.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి :

ఇప్పుడు, రైల్వే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పై లేదా రైలులో రైల్ నీర్ చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు. సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఇతర కంపెనీల వాటర్ బాటిళ్లు కూడా చౌకగా లభించనున్నాయి. రైల్వే స్టేషన్లు, రైళ్లలో విక్రయించే రైల్వేలు ఎంపిక చేసిన IRCTC/ఇతర బ్రాండ్ల ప్యాక్ చేసిన వాటర్ బాటిళ్ల గరిష్ట రిటైల్ ధరను కూడా లీటరు బాటిల్‌కు రూ.15 నుంచి రూ.14కి, 500 మి.లీ బాటిల్‌కు రూ.10 నుంచి రూ.9కి సవరించనున్నట్లు రైల్వే బోర్డు తన అధికారిక నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఐఆర్‌సీటీసీకి రూ. కోట్లల్లో లాభం :
ఇండియన్ రైల్వేస్ యాజమాన్యంలోని ఐఆర్‌సీటీసీ కంపెనీ రైల్ నీర్ ఇండియన్ రైల్వేస్ స్టేషన్లు, రైళ్లలో నీటిని విక్రయిస్తుంది. మిగతా అన్ని కంపెనీలు వాటర్ బాటిళ్లను రూ.20కి విక్రయిస్తుండగా, ఐఆర్‌సీటీసీ రైల్ నీర్ బాటిళ్లను రూ.15కి విక్రయిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్ నీర్‌ను అమ్మడం ద్వారా కంపెనీ రూ. 46.13 కోట్ల లాభాన్ని ఆర్జించింది.