Raksha Bandhan : రక్షా బంధన్ గిఫ్ట్ గైడ్.. రూ. 1000 లోపు ధరలో టాప్ గాడ్జెట్లు ఇవే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!

Raksha Bandhan : రక్షా బంధన్ కోసం మీ సోదరికి రూ. 1000 లోపు ధరలో అద్భుతమైన టాప్ గాడ్జెట్లు ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Raksha Bandhan Gift Guide

Raksha Bandhan : రక్షా బంధన్ పండగ వచ్చేస్తోంది. ఈ పండగ సోదరులు, సోదరీమణుల మధ్య ప్రత్యేక బంధాన్ని జరుపుకునే పవిత్రమైన పండుగ. 2025 ఏడాదిలో ఈ పండుగ (Raksha Bandhan) ఆగస్టు 9న వస్తుంది. ఈ పండుగ సమయంలో సోదరీమణులు తమ సోదరుడికి రాఖీని కడతారు.

సోదరులు తమ ఆప్యాయతకు చిహ్నంగా వారికి అద్భుతమైన బహుమతులు అందజేస్తారు. ఈ రక్షా బంధన్ సందర్భంగా మీ సోదరికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేందుకు చూస్తున్నారా? మీరు మంచి టెక్ గాడ్జెట్ కోసం చూస్తున్నట్లయితే.. రూ. 1000 లోపు ధరలో కొన్ని అద్భుతమైన గాడ్జెట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన గాడ్జెట్ గిఫ్ట్ ఇచ్చి చూడండి..

హెయిర్ స్ట్రెయిట్నర్ :
మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. చాలా వరకు దాదాపు రూ. 1000 ధరకు లభిస్తాయి. మీ సోదరికి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోజువారీ హెయిర్ స్టైలింగ్‌కు అవసరమైన ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Nohing Phone 3 : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. నథింగ్ ఫోన్ 3పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

జియో ట్యాగ్ :
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం జియో ట్యాగ్ అమెజాన్‌లో రూ. 999కి లభిస్తుంది. ఈ గాడ్జెట్ మీ సోదరికి చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ చేసేవారికి ఈ జియో ట్యాగా చాలా అద్భుతంగా ఉంటుంది. వస్తువులను ఎక్కడైనా పెట్టి మర్చిపోతుంటే బ్యాగ్ లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన వస్తువులను ఈజీగా ట్రాక్ చేయొచ్చు. మీ ఈ గాడ్జెట్‌లో 120db లౌడ్‌నెస్‌తో బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులను ఈజీగా గుర్తించగలదు.

స్మార్ట్ వాచ్ :
హై-ఎండ్ మోడల్స్ చాలా ఖరీదైనవి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 1000 కన్నా తక్కువ ధరకే కొన్ని స్మార్ట్‌వాచ్‌లను కొనేసుకోవచ్చు. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్‌లు బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తాయి. మీ సోదరికి అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పొచ్చు.

ఇయర్‌బడ్‌లు, హెయిర్ డ్రైయర్‌లు, పవర్ బ్యాంకులు, పోర్టబుల్ స్పీకర్లు వంటి ఇతర టెక్ గాడ్జెట్లు కూడా రూ. 1000 లోపు ధరకు అందుబాటులో ఉన్నాయి. రక్షా బంధన్ కోసం మరిన్ని గిఫ్ట్ ఆప్షన్లను కూడా అందిస్తున్నాయి.

ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ స్వాతంత్ర్య దినోత్సవ సేల్స్ అందిస్తున్నాయి. ఈ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.