Nohing Phone 3 : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. నథింగ్ ఫోన్ 3పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

Nohing Phone 3 : నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. అమెజాన్‌ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Nohing Phone 3 : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. నథింగ్ ఫోన్ 3పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

Nohing Phone 3

Updated On : August 3, 2025 / 10:49 AM IST

Nohing Phone 3 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. యూకే ఆధారిత బ్రాండ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ (Nohing Phone 3) సందర్భంగా ఈ నథింగ్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. రూ. 56వేలు తక్కువ ధరకే లభిస్తోంది.

ఈ నథింగ్ ఫోన్ 3 అసలు ధర రూ. 79,999 ధర ఉండగా, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్లీన్, క్లటర్-ఫ్రీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ :
అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 ప్రస్తుతం రూ.56,500 ధరకు లిస్ట్ అయింది. లాంచ్ ధర నుంచి రూ.23,499కి తగ్గింది. ఆసక్తిగల కస్టమర్లు SBI క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : E-Aadhaar App : ఆధార్ హోల్డర్లకు అలర్ట్.. ఇకపై నో ఫిజికల్ కార్డు.. అతి త్వరలో QR వెరిఫికేషన్‌తో ఇ-ఆధార్ యాప్.. ఇదేలా పనిచేస్తుందంటే?

పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ.33,400 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు రూ. 2,726 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ HDR10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. అదనంగా, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4తో పాటు 16GB వరకు ర్యామ్, హుడ్ కింద 512GB వరకు స్టోరేజ్‌తో సపోర్టు ఇస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.