Ram Mandir Opening : రామమందిరం ప్రారంభోత్సవం రోజున రిలయన్స్ ఆఫీసులన్నీ క్లోజ్.. స్టాక్ మార్కెట్ కూడా..!

Ram Mandir Opening : జనవరి 22న అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలను పురస్కరించుకుని అన్ని ఆఫీసులకు సెలవుదినంగా ప్రకటించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సెలవుదినంగా ముందుగానే ప్రకటించింది.

Ram Mandir Opening _ Reliance Industries declares holiday for all its offices on Jan 22

Ram Mandir Opening : అయోధ్యలోని రామమందిర శంకుస్థాపన వేడుకను పురస్కరించుకుని జనవరి 22న దేశవ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు సెలవులను ప్రకటిస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు పూజలో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తమ అన్ని కార్యాలయాలకు సెలవుదినంగా ప్రకటించినట్టు కంపెనీ పేర్కొంది.

Read Also : Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో తెలుసా? పూర్తి వివరాలు..

డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం ఎంతంటే? : 
అయోధ్య రాముని దైవ కార్యాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేసుకునే అవకాశాన్ని తమ ఉద్యోగులకు కల్పిస్తున్నట్టు తెలిపింది. కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ నిర్ణయంతో దేశవ్యాప్తంగా అన్ని రిలయన్స్ ఆఫీసులు జనవరి 22న సెలవుదినాన్ని పాటించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్.. డిసెంబరు త్రైమాసికంలో నికర లాభం రూ. 19,641 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 17,706 కోట్లతో పోలిస్తే.. ఏడాది ప్రాతిపదికన 11 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంకులకు హాఫ్ డే సెలవు :
మరోవైపు.. అయోధ్య శంకుస్థాపన వేడుక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. తమ ఉద్యోగులను వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులను హఫ్ డే (మధ్యాహ్నం 2.30 గంటల వరకు) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అనేక ఇతర రాష్ట్రాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా రాముని ఉత్సవాల్లో ఉద్యోగుల పాలుపంచుకునేందుకు సెలవులు ప్రకటించాయి.

Reliance Industries holiday

జనవరి 22న స్టాక్ మార్కెట్‌కు హాలీడే :
ఇదిలా ఉండగా, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన కారణంగా సోమవారం (జనవరి 22) స్టాక్ మార్కెట్‌కు సెలవు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం (జనవరి 20) పూర్తి ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రామమందిర నిర్మాణానికి సహకరించిన కార్మికుల కుటుంబీకులు హాజరుకానున్నారు. అయోధ్యలో ఇప్పటికే సన్నాహా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జనవరి 16న గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Read Also : Raja Singh: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు