Simone Tata : రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా ఇక లేరు.. లక్మే, వెస్ట్‌సైడ్‌ సృష్టికర్తగా ఆమె ప్రస్థానం ఎలా మొదలైందంటే?

Simone Tata : రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. లక్మే, వెస్ట్‌సైడ్‌ సృష్టికర్తగా ఎన్ని అద్భుతాలు సాధించారు.

Simone Tata : రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా ఇక లేరు.. లక్మే, వెస్ట్‌సైడ్‌ సృష్టికర్తగా ఆమె ప్రస్థానం ఎలా మొదలైందంటే?

Simone Tata

Updated On : December 5, 2025 / 3:41 PM IST

Simone Tata : దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా 95ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. సిమోన్ టాటా నోయెల్ టాటా తల్లి కూడా. గతకొంతకాలంగా సిమోన్ టాటా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా  దుబాయ్‌లోని కింగ్స్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు.

అనంతరం ఈ ఆగస్టు ప్రారంభంలో ఆమె (Simone Tata) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న సిమోన్ టాటాను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించిన సిమోన్ 1953లో 23 ఏళ్ల వయస్సులో పర్యాటకురాలిగా భారత్‌ను మొదటిసారి సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా తనకంటే 26 ఏళ్లు పెద్దవాడైన నావల్ టాటాను సిమోన్ టాటా కలిసింది. 1955లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ముంబైలో స్థిరపడింది.

లక్మే, చైన్ ట్రెంట్ విజయాల్లో కీలక పాత్ర :

సిమోన్ టాటా బ్యూటీ ప్రొడక్ట్ బ్రాండ్ లక్మేను స్థాపించింది. ఆ తర్వాత రిటైల్ చైన్ ట్రెంట్ లిమిటెడ్‌ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది. 1980 ప్రారంభం నుంచి లక్మేకు చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2006 వరకు ట్రెంట్‌కు నాయకత్వం వహించారు. 4 దశాబ్దాలుగా భారత సౌందర్య, రిటైల్ పరిశ్రమలను రూపొందించారు.

మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మహిళలు పాశ్చాత్య బ్యూటీ ప్రొడక్టులపై ఆధారపడకుండా భారతీయ మేకప్ బ్రాండ్‌ను నిర్మించాలని కంపెనీని కోరారు. ఆ తర్వాత 1952లో టాటా గ్రూప్ లక్మేను స్థాపించింది. 1996లో టాటా గ్రూప్ పునర్నిర్మాణంలో లక్మేను హిందూస్తాన్ యూనిలీవర్‌కు విక్రయించింది.

Read Also : iPhone 15 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 15 ప్లస్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

ట్రెంట్ ఆధ్వర్యంలో వెస్ట్‌సైడ్‌ను స్థాపించేందుకు సిమోన్ ఆదాయాన్ని వినియోగించారు. భారతీయ మార్కెట్లో అత్యంత పాపులర్ పొందిన డిపార్ట్‌మెంట్ స్టోర్ చైన్‌లలో ఒకటిగా మారింది. టాటా ఇండస్ట్రీస్ బోర్డులో కూడా సిమోన్ టాటా పనిచేశారు. 2006లో రిటైర్మెంట్ తర్వాత సిమోన్ పెద్దగా బయటకు రాలేదు. చివరిసారిగా అక్టోబర్ 2024లో మరణించిన ఆమె సవతి కుమారుడు, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలకు హాజరయ్యారు. రతన్ టాటా మరణం తరువాత నోయెల్ టాటా టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

హిందూస్తాన్ లివర్ ఎప్పుడు అమ్ముడైంది? :
1996లో టాటా లక్మేను హిందూస్తాన్ లివర్ లిమిటెడ్ (HLL)కి విక్రయించింది. ఈ ఆదాయాన్ని ట్రెంట్‌ను స్థాపించేందుకు ఉపయోగించారు. టాటా పాపులర్ వెస్ట్‌సైడ్ బ్రాండ్‌ను క్రియేట్ అయింది. తద్వారా ట్రెంట్ లిమిటెడ్ కింద నిర్వహిస్తోంది. ఆమె 2006 వరకు ట్రెంట్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా కొనసాగింది.

సిమోన్ టాటా సర్ రతన్ టాటా ఇన్స్టిట్యూట్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్‌తో అనుబంధంగా గుర్తింపు పొందిన ఛారిటబుల్ సంస్థ చిల్డ్రన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా (CWI)కి ఆమె ట్రస్టీగా కూడా ఉన్నారు. భారత మార్కెట్లో కళల సామర్థ్యాలు, మౌలిక సదుపాయాలను బలోపేతంపై దృష్టి సారించిన భారత్ ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్‌కు ఆమె ట్రస్టీగా కూడా ఉన్నారు.