iPhone 15 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 15 ప్లస్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!
iPhone 15 Plus : ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

iPhone 15 Plus : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఐఫోన్ 15 ప్లస్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. భారీ డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, ప్రీమియం-లెవల్ బడ్జెట్‌తో అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందించే ఐఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్లస్ అద్భుతమైన ఫోన్లలో ఇదొకటి. గత జనరేషన్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ధర తగ్గింపుతో అందిస్తోంది. తక్కువ ధరకు కొత్త ఐఫోన్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ 15 ప్లస్ ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో డైనమిక్ ఐలాండ్, USB-C పోర్ట్, అద్భుతమైన కెమెరాలు, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్ అసలు ధర మొదట రూ. 79,900గా ఉండేది. కానీ, ఇప్పుడు రూ. 19వేల కన్నా తక్కువకు లభిస్తోంది. కొనుగోలుదారులకు అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్ డీల్ : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్ మోడల్ రూ.59,999కి అందుబాటులో ఉంది. దాదాపు రూ.79,900 సేల్ ధర నుంచి రూ.19,901 తగ్గింపు పొందింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ధర దాదాపు రూ.55,999కి తగ్గుతుంది.

ఈ ఐఫోన్ 15 ప్లస్ మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ వాల్యూగా రూ.44,450 వరకు పొందవచ్చు. దాంతో ఈ ఐఫోన్ ఫైనల్ ధర మరింత తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంకుల ఆఫర్‌ను బట్టి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.

ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్లు : 2023లో లాంచ్ అయిన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రోతో పాటు ఐఫోన్ 15 ప్లస్ ఈ సిరీస్‌లో అత్యధిక బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్‌లో 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A16 బయోనిక్ చిప్‌పై రన్ అవుతుంది. 512GB వరకు స్టోరేజీని అందిస్తుంది.

ఈ ఐఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 48MP మెయిన్ సెన్సార్, ఫొటోగ్రఫీ కోసం 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 100 గంటల వరకు ఆడియో, దాదాపు 26 గంటల వరకు వీడియోను ప్లే అందిస్తుంది. ఆపిల్ ఫోన్‌కు ఒక ఏడాది వారంటీని ఇన్-బాక్స్ అప్లియన్సెస్ ఒక ఏడాది వారంటీని కూడా అందిస్తుంది.
