RBI ఝలక్: పాపం Vodafone!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వొడాఫోన్ నెట్‌వర్క్‌కు షాక్ ఇచ్చింది. టెలికాం కంపెనీ Vodafone m-pesa సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్ (సీవోఏ)ను రద్దు చేసింది. కంపెనీయే స్వచ్ఛందంగా సర్టిఫికేట్‌ను వెనక్కి తిరిగి ఇచ్చేయడమే ఇందుకు ప్రధాన కారణం. తాజా నిర్ణయంతో వొడాఫోన్ కంపెనీ కస్టమర్లకు ఇటువంటి సేవలు అందించడం వీలు కాదు.
m-pesa.. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్స్ బిజినెస్ కార్యకలాపాలను నిలిపేశారు. కస్టమర్లు, మర్చంట్లకు వచ్చిన నష్టమేమీ ఉండదు. ఏదైనా వ్యాలెట్లలో వాలిడ్ క్లెయిమ్ ఉండిపోతే సెటిల్‌మెంట్ కోసం కంపెనీని సంప్రదిస్తే సరిపోతుంది. దీనికి అనుగుణంగానే కంపెనీ మూడేళ్లలోపు సెటిల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని రూల్.
వొడాఫోన్, ఐడియా కంపెనీల విలీనం కారణంగానే ఈ సర్వీసును క్లోజ్ చేయాలనుకుంది వొడా. పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ (పీఎస్‌వో) ఇది మనీ ట్రాన్సఫరింగ్‌కు వాడేవాళ్లు. ఏ ట్రాన్సక్షన్ అయినా చేసుకోవడానికి వీలుండేది. ప్రస్తుత మార్కెట్లో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే లాంటి మనీ ట్రాన్సఫరింగ్ యాప్‌లకు పోటీ ఇవ్వలేకపోవడం కూడా ఓ కారణం కావచ్చు.
2015లో రిజర్వు బ్యాంక్ 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చింది. అందులో Vodafone m-pesa కూడా ఒకటి. RBI 2019 ఆగస్ట్‌లో పీపీఐలకు KYC నిబంధలన గడువును 18 నెలల నుంచి 24 నెలలకు పెంచిన విషయం తెలిసిందే.