RBI hikes key lending rate
RBI hikes key lending rate: సామాన్యుడికి ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. రెపోరేటును పెంచుతున్నట్లు చెప్పారు. దీంతో ఇళ్ళు, వాహనాలు వంటి రుణాల ఈఎంఐలు పెరగనున్నాయి. రెపోరేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఇప్పుడు అది 5.40 శాతానికి చేర్చింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపోరేటును పెంచడం గమనార్హం.
ఆర్బీఐ మే నెలలో 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఆ తదుపరి నెల మరో 50 పాయింట్లు పెంచింది. ఈ సారి రెపోరేటు దాదాపు 35 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, ఆర్బీఐ అంతకు మించి పెంచింది. ఆగస్టు 3 నుంచి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించారు. జూన్‌లో రీటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా నమోదుకాగా, అంతకు ముందు నెల 7.04 శాతంగా ఉంది. ఈ ప్రభావంతో రెపోరేటును ఇప్పుడు 50 బేసిస్ పాయింట్లు (బీపీసీ) పెంచుతూ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది.
China Taiwan Tension: తైవాన్‌కు వెళ్ళకుండా మమ్మల్ని అడ్డుకోలేరు: నాన్సీ ఫెలోసీ