RBI Repo Rate
RBI Repo Rate : సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. కొత్త ఇల్లు కొనేవారికి, కారు కొనాలని చూస్తున్నవారికి (RBI Repo Rate) పండగే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ప్రస్తుతం 6శాతం నుంచి 5.5శాతానికి తగ్గించింది. రెపో రేటు తగ్గింపుతో గృహ, కార్ల లోన్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గనున్నాయి. రుణగ్రహీతలకు ఈఎంఐలపై భారం కూడా తగ్గనుంది.
Read Also : Vivo V50 Elite Edition Review : అద్భుతమైన ఫీచర్లతో వివో V50 ఎలైట్ ఎడిషన్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC) మూడు రోజుల సమీక్ష అనంతరం రెపో రేటుపై ఈ కీలక నిర్ణయం ప్రకటించింది.
ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా రెండు సార్లు రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ ఏప్రిల్‌లో 25-బేసిస్ పాయింట్ల తగ్గింపుతో మూడోసారి రెపో రేటు తగ్గించింది. ద్రవ్యోల్బణం తగ్గడంతో పాటు ఆర్థిక వృద్ధి మందగించడం వంటి అంశాల కారణంగా సెంట్రల్ బ్యాంకు రెపో రేటులో భారీగా కోత విధించింది.
రుణగ్రహీతలకు చౌకైన రుణాలు :
ఆర్బీఐ వాణిజ్య (RBI Repo Rate) బ్యాంకులకు ఇచ్చే రేటునే రెపో రేటు అంటారు. ఈ రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకులు రుణ రేట్లను తగ్గిస్తాయి. అప్పుడు లోన్లు తీసుకునేవారికి చౌకైన రుణాలు అందుతాయి.
ఒకవేళ బ్యాంకులు పూర్తి ప్రయోజనాన్ని అందిస్తే మాత్రం గృహ రుణాలు, కారు రుణాలు, ఇతర పర్సనల్ లోన్లు చౌకగా అందుతాయి. ఫలితంగా ఈఎంఐలు దిగొస్తాయి. అంతేకాదు.. రుణగ్రహీతలకు వడ్డీ భారం కూడా తగ్గుతుంది.
Read Also : RBI MPC Review : రుణగ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. మూడోసారి రెపో రేటు తగ్గింపు.. ఈసారి ఎంతంటే?
కొత్త ఇల్లు కొనుగోలుదారులకు, ముఖ్యంగా ఫస్ట్ టైం ఇల్లు కొనేవారికి భారీ ఉపశమనం లభించనుంది. రుణ వ్యయాలు తగ్గడం వల్ల ముఖ్యంగా మధ్యస్థ, ఉన్నత స్థాయి విభాగాలలో కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది వినియోగదారులు ఆసక్తి చూపిస్తారు.
ఫిక్స్‌డ్ రేట్ రుణాలపై ఎలాంటి మార్పు ఉండదు. ఎప్పటిలానే అలాగే ఉంటాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పటికే రుణ రేట్లను భారీగా తగ్గించాయి.