Realme Narzo 80 Series : అమెజాన్‌‌లో రియల్‌మి కొత్త 5G సిరీస్ ఫోన్ సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లు.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

Realme Narzo 80 Series : అమెజాన్‌లో రియల్‌మి నార్జో 80 సిరీస్ ఫోన్ సేల్ ఈరోజు (ఏప్రిల్ 15) మొదలువుతోంది. బ్యాంకు ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో తక్కువ ధరకే రియల్‌మి ఫోన్ కొనేసుకోవచ్చు.

Realme Narzo 80 Series

Realme Narzo 80 Series : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కె్ట్లో రియల్‌మి నార్జో 80 సిరీస్ ఫోన్ ఫస్ట్ టైమ్ ఓపెన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ లైనప్‌లో రియల్‌మి నార్జో 80x 5G, రియల్‌మి నార్జో 80 ప్రో 5G ఫోన్లు ఉన్నాయి. ఈ రెండూ ఆకర్షణీయమైన స్పెషిఫికేషన్లతో వస్తాయి.

రియల్‌మి నార్జో 80 ప్రో 5జీ, రియల్‌మి నార్జో 80x 5G ఫోన్ ఏప్రిల్ 15 (ఈరోజు) నుంచే మధ్యాహ్నం 12 గంటలకు (IST) భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఈ రెండు ఫోన్లలో అమెజాన్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఇతర మెయిన్ ఛానెల్స్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

Read Also : Vivo V40 Pro : భలే డిస్కౌంట్ బాస్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V40 ప్రోపై భారీ తగ్గింపు.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

రియల్‌మి నార్జో 80 సిరీస్ ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో రియల్‌మి నార్జో 80ప్రో 5G ఫోన్ (8GB/128GB) బేస్ మోడల్‌ ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, 8GB/256GB, 12GB/256GB వేరియంట్‌లు వరుసగా రూ.21,499, రూ.23,499 ధరలకు లభిస్తాయి.

రియల్‌మి నార్జో 80 సిరీస్‌లోని అన్ని కాన్ఫిగరేషన్‌లపై రూ.1,500 విలువైన డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తోంది. అంతేకాదు.. వినియోగదారులు అన్ని ప్రధాన బ్యాంకుల కార్డులతో రియల్‌మి ఫోన్‌పై రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రియల్‌మి నార్జో 80 ప్రో 5G, రియల్‌మి నార్జో 80x 5G ఫోన్ 6 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి నార్జో 80x ధర :
భారత మార్కెట్లో రియల్‌మి నార్జో 80x బేస్ 6GB/128GB మోడ్‌ ధర రూ.13,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 8GB / 128GB కాన్ఫిగరేషన్ మీకు రూ.14,999 ఇస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో కూపన్ ద్వారా రియల్‌మి రూ.250, రూ.1,750 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

రియల్‌మి నార్జో 80ప్రో 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి నార్జో 80ప్రో 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల FHD+ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7400 SoC ద్వారా ఆధారితమైన 12GB వరకు (LPDDR4X) ర్యామ్, 256GB స్పీడ్ UFS 3.1 స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది. రియల్‌మి యూఐ 6తో ఆండ్రాయిడ్ 15పై రన్ అయ్యే ఈ ఫోన్ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌లో OISతో కూడిన 50MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ కెమెరా 16MP కలిగి ఉంది. గేమర్‌ల కోసం BGMIలో 90FPS గేమ్‌ప్లేకు సపోర్టు ఇస్తుంది. స్టేబుల్ పర్ఫార్మెన్స్ కోసం పెద్ద 6050mm² VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. IP66/IP68/IP69 రేటింగ్‌తో వస్తుంది. ఈ రియల్‌మి ఫోన్ 7.55mm వద్ద సన్నగా 179 గ్రాముల వద్ద లైట్‌వెయిట్ ఉంటుంది. పోర్టబుల్‌గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ కోసం కొనుగోలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్.

రియల్‌మి నార్జో 80x 5G స్పెసిఫికేషన్లు :
భారత్‌ మార్కెట్లో రియల్‌మి నార్జో 80x 5జీ ఫోన్ లాంచ్ చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6400 SoC ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు (LPDDR4x) ర్యామ్, అదనంగా 10GB వర్చువల్ ర్యామ్ అందిస్తుంది. 2TB వరకు స్టోరేజీని విస్తరించవచ్చు. ఈ ఫోన్ రియల్‌మి UI 6.0తో ఆండ్రాయిడ్ 15 రన్ అవుతుంది. 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

రియల్‌మి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP (OMNIVISION) ప్రైమరీ సెన్సార్, 2MP పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ కెమెరా 16MP కలిగి ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68/IP69 రేటింగ్‌తో వస్తుంది. సోనిక్‌వేవ్ వాటర్ ఎజెక్షన్ టెక్, స్లిమ్ 7.94mm ప్రొఫైల్‌ను కలిగి ఉంది.

Read Also : Redmi A5 Launch : ఐఫోన్ 16 డిజైన్‌‌తో రెడ్‌మి A5 కొత్త ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్..!

అదనపు ఫీచర్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB టైప్-C ఆడియో, సూపర్ లీనియర్ స్పీకర్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G (SA/NSA), Wi-Fi ac, బ్లూటూత్ 5.3, GLONASS గెలీలియో వంటి GPS సిస్టమ్‌లను కలిగి ఉంటాయి. ఫీచర్-రిచ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా మారుతుంది.