Redmi A5 Launch : ఐఫోన్ 16 డిజైన్‌తో రెడ్‌మి A5 కొత్త ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్..!
Redmi A5 Launch : షావోమీ రెడ్‌మి A5 ఫోన్ వచ్చేసిందోచ్.. 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15, 32MP కెమెరాతో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 16 నుంచే ప్రారంభం కానుంది.

Redmi A5 Launch
Redmi A5 Launch : కొత్త షావోమీ ఫోన్ కొంటున్నారా? బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ లైనప్‌లో షావోమీ సరికొత్త ఫోన్ తీసుకొచ్చింది. భారత మార్కెట్లో ఐఫోన్ 16 మాదిరి డిజైన్‌తో షావోమీ Redmi A5 ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఏప్రిల్ 16న ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 6,499 కాగా, 4GB + 128GB మోడల్ రూ. 7,499కు లభిస్తుంది. కొనుగోలుదారులు పాండిచ్చేరి బ్లూ, జస్ట్ బ్లాక్, జైసల్మేర్ గోల్డ్ అనే 3 కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.
డిస్‌ప్లే :
రెడ్‌మి A5 ఫోన్ 1640 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్క్రీన్ 600 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని చేరుకుంటుంది.
కంటి సౌకర్యం కోసం (TÜV) రీన్‌ల్యాండ్ ద్వారా వెరిఫై అయింది. ఫిజికల్ బిల్డ్ పరంగా, రెడ్‌మి ఫోన్ 193 గ్రాముల బరువు, 8.26 మిమీ మందంతో వస్తుంది. డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ52 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.
సాఫ్ట్‌వేర్, పర్ఫార్మెన్స్ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. నియర్-స్టాక్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పనిచేస్తుంది. యూనిసోక్ T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. మాలి-G57 జీపీయూ కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌లో 1.8GHz వద్ద క్లాక్ చేసిన పెర్ఫార్మెన్స్ కోర్లు, 1.6GHz వద్ద ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. రెడ్‌మి A5 ప్రత్యేకమైన మైక్రో SD స్లాట్ ద్వారా 2TB వరకు మెమరీ ఎక్స్‌టెన్షన్, ఎక్స్‌టెండెడ్ స్టోరేజీని సపోర్ట్ చేస్తుంది.
కెమెరా సామర్థ్యాలు :
రెడ్‌మి ఫోన్ బ్యాక్ సైడ్ 32MP డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. పోర్ట్రెయిట్, నైట్ మోడ్, అల్ట్రా HD, టైమ్-లాప్స్, వీడియో వంటి వివిధ మోడ్‌లకు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఉంది. రెండు కెమెరాలు 1080p, 720p వద్ద సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద వీడియోను రికార్డ్ చేయగలవు.
బ్యాటరీ, ఛార్జింగ్ :
రెడ్‌మి A5 ఫోన్ 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. బాక్స్‌లో 15W ఛార్జర్ అందించారు. ఈ ఫోన్ USB టైప్-C పోర్ట్‌ను ఉపయోగిస్తుంది. OTG యాక్టివిటీకి సపోర్టు ఇవ్వదు.
రెడ్‌మి A5 సేల్ :
రెడ్‌మి A5 ఫోన్ ఏప్రిల్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. 3GB + 64GB, 4GB + 128GB అనే రెండు వేరియంట్‌లు ఫస్ట్ సేల్ విండోలో అందుబాటులో ఉంటాయి.