OnePlus Nord CE5 : వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. Nord CE5 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

OnePlus Nord CE5 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ నార్డ్ CE 5 ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్ అయ్యాయి.

OnePlus Nord CE5 : వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. Nord CE5 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

OnePlus Nord CE5

Updated On : April 15, 2025 / 12:04 PM IST

OnePlus Nord CE5 Launch : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ CE5 లాంచ్‌కు రెడీ అవుతోంది. రాబోయే ఈ వన్‌ప్లస్ ఫోన్ కొన్ని మెయిన్ అప్‌గ్రేడ్‌లతో రావచ్చు. కొత్త నివేదిక ప్రకారం.. “Honda” అనే కోడ్‌నేమ్‌తో Nord CE5 ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉంది.

Read Also : Samsung Galaxy Z Fold 6 : బంపర్ ఆఫర్ భయ్యా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్‌పై ఏకంగా రూ.35వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

ప్రస్తుతానికి ఈ వన్‌ప్లస్ రాకపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. నివేదికలను పరిశీలిస్తే.. వన్‌ప్లస్ నార్డ్ CE5 కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ నార్డ్ CE5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్‌లో బ్యాటరీనే అతిపెద్ద హైలెట్. నివేదిక ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్ భారీ 7,100mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ CE4 ఫోన్ 5,500mAh యూనిట్‌తో వస్తుంది.

హుడ్ కింద, వన్‌ప్లస్ నార్డ్ CE5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ద్వారా పవర్ పొందింది. లాజికల్ అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ రాబోయే నార్డ్ సిరీస్ ఫోన్ గత ఫోన్ మాదిరిగానే UFS 3.1 స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది.

Read Also : IRCTC Tour Packages : సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC స్పెషల్ ట్రైన్ల ప్యాకేజీలు ఇవే.. 10 రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు..!

వన్‌ప్లస్ నార్డ్ CE5 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ CE5 వచ్చే నెల (మే) ప్రారంభంలోనే లాంచ్ కావచ్చు. ప్రస్తుతానికి, వన్‌ప్లస్ నార్డ్ CE5 గురించి అధికారిక సమాచారం లేదు. వన్‌ప్లస్ నార్డ్ CE5 వివరాలన్నీ కేవలం అంచనా మాత్రమేనని గమనించాలి.