Samsung Galaxy Z Fold 6 : బంపర్ ఆఫర్ భయ్యా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్‌పై ఏకంగా రూ.35వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Samsung Galaxy Z Fold 6 : మడతబెట్టే ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్ భారీ తగ్గింపుతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎంత? ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy Z Fold 6 : బంపర్ ఆఫర్ భయ్యా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్‌పై ఏకంగా రూ.35వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Samsung Galaxy Z Fold 6

Updated On : April 13, 2025 / 7:37 PM IST

Samsung Galaxy Z Fold 6 : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? శాంసంగ్ అభిమానులు ఇప్పుడు అమెజాన్ ఇండియాలో భారీ తగ్గింపుతో గెలాక్సీ Z ఫోల్డ్ 6 పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 అతి త్వరలో లాంచ్ కానుంది. ప్రస్తుత జనరేషన్ ఫోల్డబుల్ ధర రూ. 35వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రారంభ కొనుగోలుదారులు టెక్ ఔత్సాహికులకు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా చెప్పవచ్చు.

Read Also : Realme GT 6T : రియల్‌మి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో చౌకైన ధరకే రియల్‌మి 5G ఫోన్ కొనేసుకోండి.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదు..!

అమెజాన్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 6 తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 రూ.1,64,999 ప్రారంభ ధరకు లాంచ్ కాగా అమెజాన్‌లో రూ.1,31,473కి జాబితా అయింది. ఏకంగా రూ.33,526 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. కొనుగోలుదారులు మరిన్ని బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

HDFC బ్యాంక్‌, బ్యాంక్ కార్డులపై అదనంగా రూ. 1,500 డిస్కౌంట్
హెచ్‌డీఎఫ్‌సీ ఈఎంఐ ఆఫర్ : ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,250 అదనపు డిస్కౌంట్
ఈఎంఐ ప్లాన్‌లు నెలకు రూ. 6,374 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్
ఎక్స్ఛేంజ్ ఆఫర్ : పాత ఫోన్లపై రూ. 22,800 వరకు డిస్కౌంట్ (మోడల్, కండిషన్ ఆధారంగా)
మొత్తం ప్రొటెక్షన్ ప్లాన్ : యాడ్-ఆన్ రూ. 8,999కు లభిస్తుంది.
నేవీ, సిల్వర్ షాడో కలర్ ఆప్షన్లలో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్, ఫోల్డబుల్ టెక్నాలజీని అందిస్తుంది.
ప్రైమరీ డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 7.6-అంగుళాల QXGA+ అమోల్డ్ డిస్‌ప్లే
కవర్ డిస్‌ప్లే : 6.3-అంగుళాల HD+ డైనమిక్ అమోల్డ్ 2X స్క్రీన్
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ద్వారా రే ట్రేసింగ్ సపోర్టు
మెమరీ : 12GB ర్యామ్, 1TB స్టోరేజీ వరకు
బ్యాటరీ : 4,400mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సాఫ్ట్‌వేర్ : గెలాక్సీ ఏఐ ఫీచర్లు, డిజైన్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7పై రన్ అవుతుంది.

కెమెరా సెటప్ :
ట్రిపుల్ బ్యాక్ కెమెరా :
OISతో 50MP ప్రైమరీ సెన్సార్
50MP అల్ట్రా-వైడ్ లెన్స్
3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్

ఫ్రంట్ కెమెరాలు :
కవర్ స్క్రీన్‌పై 10MP సెల్ఫీ కెమెరా
ప్రైమరీ స్క్రీన్‌పై 4MP అండర్-డిస్‌ప్లే కెమెరా

Read Also : Samsung Galaxy A26 5G : శాంసంగ్ ఫోన్ భలే ఉందిగా.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A26 5Gపై బంపర్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఈ ఫోన్ కొనాలా వద్దా? :
అత్యాధునిక స్పెషిఫికేషన్స్, గెలాక్సీ AI ఇంటిగ్రేషన్ కలిగిన శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే.. గెలాక్సీ Z ఫోల్డ్ 7 రాకముందే ఈ అమెజాన్ డీల్‌ అతి తక్కువ ధరకే పొందవచ్చు.