Xiaomi Mi TVకి పోటీగా : Realme TV వచ్చేస్తోంది!

  • Publish Date - January 9, 2020 / 10:31 AM IST

ఒప్పో మొబైల్ సబ్ బ్రాండ్ Realme నుంచి కొత్త స్మార్ట్ టీవీ రాబోతోంది. షియోమీకి Mi TVకి పోటీగా Realme TVని మార్కెట్లోకి దించుతోంది. ప్రపంచవ్యాప్తంగా దేశీయ మార్కెట్లలో స్మార్ట్ టీవీలకు రోజురోజుకీ గిరాకీ పెరిగిపోతోంది. యూజర్లు కూడా స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే స్మార్ట్ టీవీలు కొనేందుకు ఆస్తకి చూపిస్తున్నారు.

2020లో రియల్ మి నుంచి కొత్త స్మార్ట్ టీవీ మోడల్ రిలీజ్ చేయనున్నట్టు ఓ రిపోర్ట్ తెలిపింది. Shenzhen ఆధారిత కంపనీగా అవతరించిన Realme కంపెనీ 2019లోనే ఫస్ట్ Realme TV మోడల్ లాంచ్ చేయబోతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. చైనాలోని బీజింగ్ లో Realme X50 5G మోడల్ ఫోన్ లాంచింగ్ సందర్భంగా కంపెనీ చీప్ మార్కెటింగ్ ఆఫీసర్ జియూ క్యూయి చేజ్ హింట్ ఇచ్చారు.

స్మార్ట్ టీవీ మార్కెట్ తో పాటు రియల్ మి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (loT) కనెక్టెట్ డివైజ్ లపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ ఏడాదిలో కొత్త కనెక్టెట్ డివైజ్ లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు గత నవంబర్ నెలలోనే రియల్ మి ఇండియా సీఈఓ ఇండియా మాధవ్ సేథ్ తెలిపారు. 2019 ఏడాదిలోనే ఆపిల్ AirPodsకు పోటీగా Realme Buds Air లాంచ్ చేసింది. మరోవైపు షియోమీ Mi Band ఫ్యామిలీకి పోటీగా Realme Fitness Band కూడా ప్రవేశపెట్టనున్నట్టు మాధవ్ హింట్ ఇచ్చారు.

2018 మేలో స్థాపించిన రియల్ మి అతికొద్ది కాలంలోనే అఫర్డబుల్ స్మార్ట్ ఫోన్ల రేంజ్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వన్ ప్లస్, శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా Realme X2 Proను 2019లోనే రియల్ మి రిలీజ్ చేసింది. దీంతో హైయర్ మిండ్ రేంజ్, ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సిగ్మంట్లో కూడా తన ప్రాబల్యాన్ని చాటుకుంది.