Redmi Note 13 Pro India : 2024 జనవరిలో రెడ్‌మి నోట్ 13ప్రో వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 13 Pro India : రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ జనవరి 2024లో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ అంచనా ధర, స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Redmi Note 13 Pro India : 2024 జనవరిలో రెడ్‌మి నోట్ 13ప్రో వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 13 Pro India launch in January 2024

Redmi Note 13 Pro India : 2023 త్వరలో ముగియనుంది. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల విషయానికి వస్తే.. 2024లో అనేక స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. వచ్చే జనవరి రెండో వారంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24ని లాంచ్ చేయనుంది. అయితే, వన్‌ప్లస్ జనవరి 24న భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12ని లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఇప్పుడు, రెడ్‌మి కూడా రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ భారత మార్కెట్లో లాంచ్‌ను కానున్నట్టు కంపెనీ ధృవీకరించింది. రెడ్‌మి 13సి సిరీస్ లాంచ్ కీనోట్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారు అధికారికంగా రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ భారత మార్కెట్లో జనవరి 2024లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ డివైజ్ రెడ్‌మి నోట్ 13 సిరీస్‌లో భాగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే చైనాలో రెడ్‌మి నోట్ 12 సిరీస్ లాంచ్ అయింది.

భారత్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ లాంచ్ :
రెడ్‌మి 13సి ఈవెంట్ ముగింపు సందర్భంగా రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీని ఉపయోగించి ఫుటేజీని క్యాప్చర్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. రాబోయే నెలలో భారత మార్కెట్లో లాంచ్‌ను ధృవీకరించింది. ఈ డివైజ్ వివిధ ధృవీకరణ వెబ్‌సైట్‌లలో కనిపిస్తుంది. రెడ్‌మి 13సి ఈవెంట్‌లో రెడ్‌మి నోట్ 13 5జీ, రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీలతో సహా అద్భుతమైన లైనప్‌ని సూచించింది. రెడ్‌మి నోట్ 13 సిరీస్‌ను రూపొందించింది. ఈ మోడల్‌లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. గత వెర్షన్ల కన్నా మెరుగైన ఫీచర్‌లు, మెరుగుదలలను తీసుకురావాలనే యోచనలో ఉంది.

Read Also : Best Phones in India : ఈ డిసెంబర్‌లో రూ.35వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

భారత్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో ధర, స్పెషిఫికేషన్లు :
చైనీస్ వేరియంట్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5కె ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. మృదువైన, శక్తివంతమైన డిస్‌ప్లేను నిర్ధారిస్తుంది. భారతీయ వేరియంట్‌లో కూడా అదే ఫీచర్లు అందించనుందని భావిస్తున్నారు. హుడ్ కింద, ఫోన్ శక్తివంతమైన 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్, జీ610 గ్రాఫిక్స్‌తో అమర్చబడి ఉండవచ్చు. భారత మార్కెట్లో గరిష్టంగా 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అవుతుందని అంచనా.

Redmi Note 13 Pro India launch in January 2024

Redmi Note 13 Pro India launch 

ఈ డివైజ్ బాక్స్ వెలుపల నేరుగా ఎంఐయూఐ 14లో రన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ 120డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కూడా పొందవచ్చు. వినియోగదారులు రోజంతా కనెక్ట్ అయి ఉండవచ్చు. కెమెరా సెటప్‌లో అద్భుతమైన 200ఎంపీ ప్రైమరీ లెన్స్, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో రియర్ లెన్స్‌తో పాటు కొన్ని అద్భుతమైన ఫొటోలను తీయడానికి 16ఎంపీ సెల్ఫీ షూటర్ కూడా ఉండే అవకాశం ఉంది.

చైనీస్ వేరియంట్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ సమర్థవంతమైన ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో సహా అధునాతన కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఈ ఫీచర్లు ఫోన్ భారతీయ వేరియంట్‌కి కూడా బదిలీ అయ్యే అవకాశం లేకపోలేదు. చైనాలో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్ రూ. 1,999 యువాన్‌లతో ప్రారంభమవుతుంది.

మన కరెన్సీలో దాదాపు రూ. 23వేలు ఉంటుంది. అయితే, గత రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ 5జీ ధరల వ్యూహాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. భారతీయ వేరియంట్ ప్రారంభ ధర రూ. 30వేల వరకు ఉంటుందని అంచనా. ఈ ఫోన్ ధర ఎంత అనేది తెలియాలంటే జనవరి 2024 వరకు వేచి చూడాల్సిందే.

Read Also : Cyclone Michaung Effect : మిగ్‌జామ్‌ తుఫాను ఎఫెక్ట్.. కస్టమర్లను ఆదుకునేందుకు రంగంలోకి కార్ల కంపెనీలు.. ప్రత్యేక సర్వీసులతో సహాయక కార్యక్రమాలు!