ఇలా చేయండి : Jio Fiber కనెక్షన్ : ఇంట్లో కావాలా? ఆఫీసులోనా?
జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది. అందుకు ఏ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఈ కింది వివరాలను ఓసారి చూడండి.

జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది. అందుకు ఏ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఈ కింది వివరాలను ఓసారి చూడండి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ (ఫైబర్-టు-ది-హోమ్ -FTTH)సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫైబర్ ప్రారంభ ధర రూ.699 ప్లాన్ తో 100Mbps వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది. ఇతర పోటీదారులైన బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్ల కంటే 35-45 శాతం తక్కువ ధరకే అందిస్తోంది. మూడేళ్ల క్రితం ఆకాశాన్నింటిన అధిక డేటా ధరలన్నీ జియో రాకతో ఒక్కసారిగా దిగొచ్చాయి.
ఎక్కడ చూసిన ప్రతిఒక్కరూ జియో డేటా ప్లాన్లనే జపం చేస్తున్నారు. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్రవేశపెట్టడంతో ఇక అందరి యూజర్ల దృష్టిని దీనిపైనే పడింది. కమర్షియల్ లాంచింగ్ ముందే ప్రీవ్యూ ఆఫర్ కింద జియో ఫైబర్ సర్వీసు అందించిన రిలయన్స్.. అధికారికంగా జియో ఫైబర్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. అన్నట్టుగానే జియో ఫైబర్ సర్వీసు ద్వారా డేటా ప్లాన్లపై ధరలను కూడా ప్రకటించింది.
ప్రారంభ ధర నెలవారీ డేటా ప్లాన్ రూ.699 నుంచి (100Mbps) రూ.8వేల 499 (1Gbps) వరకు ఆఫర్ చేస్తోంది. ఫ్రీ వాయిస్ కాల్ సర్వీసు, టీవీ కాలింగ్, గేమింగ్, ఎంటర్ టైన్ మెంట్ సహా అన్నింటిలో ఈ సర్వీసును ఆఫర్ చేస్తోంది. జియో ఫైబర్ ఇన్ స్టాలేషన్ కోసం ఒకసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా రూ.2వేల 500 వరకు చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.15వందలు రిఫండబుల్ అమౌంట్ కాగా.. మిగిలిన రూ. వెయ్యి నాన్ రిఫండబుల్ ఛార్జీలు వర్తిస్తాయి.
వార్షిక డేటా ప్లాన్లు తీసుకున్న యూజర్లకు కాంప్లీమెంటరీ టెలివిజన్ సెట్ ఆఫర్ కింద రూ.2వేల 499 నుంచి రూ.8వేల 499 వరకు ఆఫర్ చేస్తోంది. నెలకు రూ.1,299 గోల్డ్ ప్లాన్ రెండేళ్ల సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. జియో ఫైబర్ సర్వీసు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆగస్టులోనే ప్రారంభమైంది. ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో మాత్రమే జియో ఫైబర్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల ఇంటర్నెట్ యూజర్లు జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది. అందుకు ఏ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఈ కింది వివరాలను ఓసారి చూడండి.
జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ ఇలా :
* జియో ఫైబర్ Book Now లింక్ పై క్లిక్ చేయండి.
* మీకు రెండు Menuలు కనిపిస్తాయి. అందులో ఒకటి Upgrade.. రెండోవది New కనెక్షన్ కోసం..
* ఇదివరకే ప్రీవ్యూ కస్టమర్ అయితే Upgrade ఆప్షన్ ఎంచుకోండి.
* కొత్త కనెక్షన్ అయితే Get Started పై క్లిక్ చేయండి.
* ఎంటర్ యూవర్ అడ్రస్ ఫర్ Jio Fiber అని ఓ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
* హోమ్ అడ్రస్ లేదా Work అడ్రస్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి.
* మొబైల్ లేదా డెస్క్ టాప్ యూజర్లు ముందుగా తమ లొకేషన్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.
* కరెంట్ లొకేషన్ change చేసి మీరు ఏ లొకేషన్ లో Jibo Fiber కనెక్షన్ కావాలో నేవిగేట్ చేయండి.
* హోమ్ అడ్రస్ అయితే.. మీ పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి.
* వర్క్ అడ్రస్ అయితే.. మీ కంపెనీ పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, కంపెనీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి.
* సెలక్ట్ Your plan అనే ఆప్షన్ దగ్గర అవసరమైన Plan ఎంచుకోండి.
* బ్రాంజ్, గోల్డ్, సిల్వర్, డైమండ్, ప్లాటినం, టైటానియం మొత్తం 6 డేటా ప్లాన్లు ఉన్నాయి.
* Terms & conditions అంగీకరిస్తూ డిఫాల్ట్ టిక్ మార్క్ ఉంటుంది. ఇది తప్పనిసరి.
* Generate OTP అనే బటన్ పై క్లిక్ చేయండి.
* మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP వెరిఫై చేసుకోండి.
* మీకు వెంటనే జియో ఫైబర్ కనెక్షన్ రిజిస్టర్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది.
గమనిక : మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే.. కనెక్షన్ అప్రూవ్ అయినట్టు కాదు. జియో ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలని మీకు ఆసక్తి ఉన్నట్టుగా జియో సర్వీసు ప్రొవైడర్లు భావిస్తారు. మీరు ఇచ్చిన లొకేషన్ బట్టి మీకు ఫైబర్ కనెక్షన్ ఎంతవరకు ఇవ్వడం సాధ్యపడుతుందో చెక్ చేస్తారు. అన్ని సరిగా ఉంటే.. తప్పనిసరిగా మీకు జియో ఫైబర్ టెక్నికల్ డిపార్ట్ మెంట్ నుంచి ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ వస్తుంది. మీకు సర్వీసు గురించి వివరణ ఇచ్చిన అనంతరం మీ అనుమతితో తదుపరి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మీరు ఎంచుకున్న డేటా ప్లాన్ ప్రకారం.. మీకు జియో ఫైబర్ కనెక్షన్ ఇస్తారు.