Trai: భారత్‌లో భారీగా తగ్గిన మొబైల్ కస్టమర్ల సంఖ్య.. కోట్ల మందిని కోల్పోయిన జియో, వోడాఫోన్!

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా స్మార్ట్‌ ఫోన్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

Trai: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా స్మార్ట్‌ ఫోన్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే, రేట్లలో మార్పులు తర్వాత జియో కస్టమర్లు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నారు.

భారతదేశంలో టెలికాం సబ్‌స్క్రైబర్లు:
2021 డిసెంబర్‌లో దేశంలో మొబైల్ కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఈమేరకు సమాచారం అందించింది. డిసెంబర్ 2021 నెలవారీ డేటా ప్రకారం, భారతదేశంలో మొబైల్ కస్టమర్ల సంఖ్య 12.8 మిలియన్లు తగ్గింది.

రిలయన్స్ జియోకి తగ్గిన కస్టమర్లు:
రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కస్టమర్లలో భారీ క్షీణత కనిపించింది. అదే సమయంలో, భారతీ ఎయిర్‌టెల్ కస్టమర్లలో పెరుగుదల ఉంది. TRAI డేటా ప్రకారం, రిలయన్స్ జియో దాదాపు 1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దాని సబ్‌స్క్రైబర్ బేస్ 41.57 కోట్లకు తగ్గింది.

వోడాఫోన్ ఐడియా డిసెంబర్ 2021లో 16.14 లక్షల మొబైల్ కస్టమర్‌లను కోల్పోయింది. 26.55 కోట్ల మంది కస్టమర్‌లు మిగలగా.. ఎయిర్‌టెల్ 4.75 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను పెంచుకుంది. దాని వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య 35.57 మిలియన్లకు చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు