×
Ad

Renault Price Hike : ఇప్పుడే కొనడం బెటర్.. 2026లో కొత్త రెనాల్ట్ కార్లు కొనలేరు.. భారీగా పెరగనున్న ధరలు.. ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!

Renault Price Hike : జనవరి 2026 నుంచి భారతీయ మార్కెట్లో అన్ని కార్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు రెనాల్ట్ ప్రకటించింది. మీరు తక్కువ ధరకు రెనాల్ట్ కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.

Renault Kwid, Triber, And Kiger

Renault Price Hike : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. మీరు కొత్త ఏడాది 2026లో రెనాల్ట్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ జనవరి 2026 నుంచి భారతీయ మార్కెట్లో అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

మీరు తక్కువ ధరకు రెనాల్ట్ కారు (Renault Price Hike) కొనాలనుకుంటే మీకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం, రెనాల్ట్ భారతీయ మార్కెట్లో 3 వాహనాలను విక్రయిస్తుంది. క్విడ్, కిగర్, ట్రైబర్ ఈ మూడింటి ధరలు డిసెంబర్ 31 తర్వాత పెరగనున్నాయి. అయితే, ధరలు ఎంత పెరుగుతాయి? ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కార్ల ధరల పెంపు ఎంతంటే? :
రెనాల్ట్ ఇండియా జనవరి 2026 నుంచి అన్ని కార్ల ధరలను 2శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ పెరుగుదల మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. తక్కువ ధరకు రెనాల్ట్ కారును కొనుగోలు చేయాలనుకుంటే డిసెంబర్ 31 లోపు కొనేసుకోవడం బెటర్.

ధరల పెరుగుదల ఎందుకంటే? :
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, మార్కెట్లో ఆర్థిక సవాళ్లే కారణమని కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో అనేక ఇతర కార్ల కంపెనీలు కూడా ఇటీవలి నెలల్లో ధరల పెంపును ప్రకటించాయి. డిసెంబర్ 2025 లోపు కార్లను కొనుగోలు చేస్తే పాత ధరలకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Read Also : Best Realme Phones : కిర్రాక్ ఫోన్లు భయ్యా.. రూ. 35వేల లోపు బెస్ట్ రియల్‌మి ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

ప్రస్తుత రెనాల్ట్ కార్లు ఇవే :

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రెనాల్ట్ 3 కార్ల మోడళ్లను విక్రయిస్తోంది. సరసమైన ధరలు, అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

రెనాల్ట్ క్విడ్ : కంపెనీ అత్యంత చౌకైన కారు. ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.30 లక్షలు. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు. బడ్జెట్‌ ధరలో మంచి కారు కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ SUV లాంటి రూపాన్ని కలిగి ఉంది. 184mm మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మోడ్రాన్ ఫీచర్లను కలిగి ఉంది.

రెనాల్ట్ ట్రైబర్ : రూ. 5.76 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో 7-సీటర్ ఫ్యామిలీ కారు. MPV కేటగిరీలోకి వస్తుంది. హైలైట్ మాడ్యులర్ సీట్లు. మీ అవసరాలకు అనుగుణంగా రిమూవ్ చేయొచ్చు లేదా ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ మోడల్ 2025లో అనేక కొత్త అప్‌డేట్స్ కూడా పొందింది. మిడిల్ క్లాసు ఫ్యామిలీలకు బెస్ట్ కారు.

రెనాల్ట్ కిగర్ : రెనాల్ట్ నుంచి వచ్చిన కాంపాక్ట్ SUV ధరలు రూ. 5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కూడా వస్తుంది.

సీఎన్‌జీ కిట్లు, రెనాల్ట్ తన 3 వాహనాలకు ప్రభుత్వం ఆమోదించిన CNG రెట్రోఫిట్‌మెంట్ కిట్‌లను ప్రవేశపెట్టింది. పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. వారంటీ సర్వీస్, కంపెనీ భారత్ అంతటా డీలర్ నెట్‌వర్క్ ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీలు, మెరుగైన సర్వీసు సపోర్టును కూడా అందిస్తోంది.