Revolt Motors: రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. బుకింగ్స్ ప్రారంభం

భారత్‌లో పెట్రోల్ రేట్ల ప్రభావమో, స్మూత్ డ్రైవింగ్‌పై ఇంట్రస్టో తెలియదు కానీ, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.

Revolt Motors: రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. బుకింగ్స్ ప్రారంభం

Revolt

Updated On : October 22, 2021 / 2:00 PM IST

Revolt Motors: భారత్‌లో పెట్రోల్ రేట్ల ప్రభావమో, స్మూత్ డ్రైవింగ్‌పై ఇంట్రస్టో తెలియదు కానీ, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే రివోల్ట్ బైక్‌లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్‌గా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేవారికి ప్రముఖ ఎలక్ట్రిక్‌ బైక్‌ల కంపెనీ రివోల్ట్‌ ఆర్‌వీ 400 బైక్‌ బుకింగ్స్‌‌ను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఈ ఏడాదిలో ఆర్‌వీ400 బైక్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయడం ఇది మూడోసారి కాగా.. దేశవ్యాప్తంగా నేటి నుంచి 70 నగరాల్లో బుకింగ్‌ అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆర్‌వీ400 బైక్‌లో న్యూ ఎక్స్‌టిరియర్‌ కలర్‌ థీమ్‌ను రివోల్ట్‌ మోటార్స్‌ అందుబాటులోకి తెచ్చింది.

ఫేమ్‌-2 పథకంలో భాగంగా ఆర్‌వీ400 ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.1.07లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. ఆర్‌వీ400 కాస్మిక్‌ బ్లాక్‌, రెబుల్‌ రేడ్‌ కలర్‌ వేరియంట్‌లలో.. మిస్ట్‌ గ్రే కలర్‌లో అందుబాటులోకి వచ్చింది.

వందశాతం లోకలైజ్ చేసే దిశగా.. దేశవ్యాప్తంగా రివోల్ట్‌ మోటార్స్‌‌ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ వెల్లడించారు. టైర్‌-1 సిటీల్లో టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో కూడా ఆర్‌వీ 400 బైక్‌ బుకింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వచ్చే ఏడాదికి భారీ ఎత్తున బైక్లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ చెబుతుంది.

తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్(జూబ్లీ హిల్స్), వరంగల్, విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలలో బుకింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బుకింగ్ చేసుకున్నవారికి జనవరి వరకు బైక్‌ను ఇచ్చే అవకాశం ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.