ధర ఎంతంటే? : రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 బుల్లెట్

భారతీయ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త వేరియంట్ లాంచ్ అయింది. క్లాసిక్ 350 సింగిల్ ఛానల్ ABS వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర (చెన్నై, ఎక్స్ షోరూం) రూ.1.46 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త మోడల్.. క్లాసిక్ 350 డ్యుయల్ ఛానల్ ABS ట్రిమ్ కంటే రూ.8వేలు చౌకైన ధరకే అందుబాటులో ఉంది. చెన్నైలో ఎక్స్ షోరూం ధర రూ.1.54లక్షల నుంచి అందుబాటులో ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 సింగిల్ ఛానల్ ABS వేరియంట్ రెండు కొత్త రంగుల్లో లభ్యమవుతోంది.
మెర్క్యూరీ సిల్వర్, ప్యూర్ బ్లాక్. లేటెస్ట్ క్లాసిక్ 350 మోడల్ ద్వారా కస్టమర్లు ఈజీగా తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంది. ఇందులో మేక్ యూవర్ ఓన్ ప్రొగ్రామ్ ఉంది. దీంతో బుల్లెట్ కొనుగోలు చేసిన వ్యక్తి బుకింగ్ స్టేజ్ లోనే పార్టులు లేదా యాక్ససరీలను కస్టమైజ్ చేసుకోవచ్చు. రెండళ్ల పాటు వారంటీ ఉంటుంది. ఈ కొత్త మోడల్ వేరియంట్ మొత్తం 6 నగరాలైన ఢిల్లీ ఎన్ సీఆర్, బెంగళూరు, చెన్నై,హైదరాబాద్, ముంబై, పుణెలో తొలి దశగా 141 స్టోర్లలో లభ్యం కానుంది.
లేటెస్ట్ క్లాసిక్ 350 సింగిల్ ఛానల్ బీఎస్ వేరియంట్ బుకింగ్ ప్రారంభంలో తీసుకునే కస్టమర్లకు మాత్రమే సొంత కస్టమైజింగ్ వర్తిస్తుంది. ఈ ప్రొగ్రామ్ దశల వారీగా ఇతర మోడల్స్ కు కూడా విస్తరించడం జరుగుతుంది. తమ మోటార్ సైకిళ్లను కస్టమర్లు.. ఇంజిన్ గార్డులు, లగేజీ సోల్యుషన్స్, ARAI కంప్లయింట్ అలోయ్ వీల్స్, ఇతర వాటిల్లో యాక్సస్ చేసుకోవచ్చు.
వ్యక్తిగత ప్రధాన్యత కోసం ఫ్యుయల్ ట్యాంకు, సైడ్ ప్యానెల్ స్టిక్కర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350.. సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్, 346 cc ఇంజిన్, 19.8bhp, 28Nm టార్క్ అందిస్తుంది. ఈ కొత్త మోడల్ బుల్లెట్ లో 5 స్పీడ్ గేర్ బాక్సును కంపెనీ ఆఫర్ చేస్తోంది.