Royal Enfield Shotgun 650 : ఇది కదా బైక్ అంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ లాంచ్, ఫీచర్లు, ధర ఎంతంటే?
Royal Enfield Shotgun 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ వచ్చేసింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ 650 ఎడిషన్ మోటార్‌సైకిల్ 25 యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

Royal Enfield Shotgun 650 Motoverse Edition Launched
Royal Enfield Shotgun 650 : కొత్త బైక్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రముఖ దేశీయ మల్టీనేషనల్ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేసింది. అదే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్.. ఈ కొత్త బైక్ ధర రూ. 4.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. సాధారణ వేరియంట్‌ల కన్నా ముందుగా లాంచ్ అయిన పరిమిత ఎడిషన్ వెర్షన్. ఈ కస్టమ్ బైక్ 25 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉండగా.. ఆసక్తి గల వినియోగదారులు నవంబర్ 25 అర్ధరాత్రి వరకు బుకింగ్‌కు చేసుకోవచ్చు.

Royal Enfield Shotgun 650
మోటోవర్స్ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో గ్రాఫిక్ మోడల్ మళ్లీ తయారు చేయకపోవచ్చు. ఈ పరిమిత ఎడిషన్ డెలివరీలు జనవరి 2024లో ప్రారంభమవుతాయి. నియో-రెట్రో మోటార్‌సైకిల్ ఎస్‌జీ 650 కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది. ప్రత్యేక ఎడిషన్ కస్టమ్-డిజైన్, హ్యాండ్-పెయింటెడ్ బాడీ ప్యానెల్‌లను కలిగి ఉంది. గ్రేడియంట్, నియాన్ డిటైలింగ్‌ను కలిగి ఉంటాయి. ఈ బైక్ మాడ్యులర్ డిజైన్ మోటార్‌సైకిల్‌ను క్లాసిక్ సింగిల్-సీటర్ నుంచి డ్యూయల్-సీటర్ బైక్‌గా మార్చేందుకు అనుమతిస్తుంది.

Royal Enfield Shotgun 650 Motoverse Edition
ఆర్ఈ షాట్‌గన్ 650 సీటు, ఇంజిన్ :
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్‌తో పది స్పోక్ వీల్ రిమ్‌లను కలిగి ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్‌లో తలకిందులుగా ఉన్న ఫోర్క్‌లు, తక్కువ-ఎత్తైన అదనపు-వెడల్పు హ్యాండిల్‌బార్‌లతో కూడిన ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం టాప్ యోక్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఛాసిస్ లూప్‌కు ట్విన్ షాక్‌లు అమర్చబడి ఉంటాయి. ఆకర్షణీయంగా కనిపించడానికి చేతితో కుట్టిన బ్లాక్ లెదర్ ఫ్లోటింగ్ సోలో సీటుతో అమర్చారు. నాలుగు బోల్ట్‌ల ద్వారా పిలియన్ సీటును ఇన్‌స్టాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. షాట్‌గన్ 650 మోడల్ బైక్ 650సీసీ ప్లాట్‌ఫారమ్‌పై తయారుచేశారు.

Royal Enfield Shotgun 650 Launch
ఈ కొత్త గ్లోస్ బ్లాక్ ఇంజిన్ కవర్‌లతో ఇంజిన్ బ్లాక్-అవుట్ అయింది. కస్టమ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వచ్చింది. ఈ బైక్ బెస్పోక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ జెన్యూన్ మోటార్‌సైకిల్ అప్లియన్సెస్ అయిన బార్ ఎండ్ మిర్రర్స్, ఎల్ఈడీ బ్లాక్ ఇండికేటర్‌లతో ప్రీలోడ్ అయింది. దీనికి అదనంగా, పరిమిత ఎడిషన్ మోటార్‌సైకిల్ ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆర్‌ఎస్ఏ సర్వీసుతో అందిస్తోంది.

Royal Enfield Shotgun 650 Price
జనవరి 2024లో డెలివరీలు :
ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 అదే 649సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్, సమాంతర-ట్విన్ సిలిండర్ ఇంజన్‌తో 47బీహెచ్‌పీ 52ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఆర్‌ఈ ఇంజిన్‌ని రీట్యూన్ చేసిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రత్యేక ఎడిషన్ వెర్షన్ జనవరి 2024లో డెలివరీ అయిన వెంటనే సాధారణ మాస్ మార్కెట్ వేరియంట్‌లు లాంచ్ అవుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ బైక్ ఎడిషన్ ధర మరింత పెరగడంతో పాటు మల్టీ వేరియంట్‌లు, కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Royal Enfield Shotgun 650 Sale
ఆర్‌ఈ షాట్‌గన్ 650 డిజైన్ :
షాట్‌గన్ 650 వెర్షన్ మరో సూపర్ మెటోర్ 650 క్రూయిజర్ నుంచి భిన్నంగా ఉంటుంది. ఇందులోని చాపడ్ ఫెండర్‌లు, హెడ్‌ల్యాంప్ చుట్టూ విభిన్నమైన డిజైన్ ప్లాస్టిక్ కేసింగ్, విభిన్న టర్నింగ్ ఇండికేషన్లు,రీడిజైన్ చేసిన ఎగ్జాస్ట్ మఫ్లర్‌ల వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

Royal Enfield Shotgun 650 Features
ఆర్‌ఈ షాట్‌గన్ 650 ఫీచర్లు :
అదనంగా , ఫ్లాట్ హ్యాండిల్‌బార్, బార్-ఎండ్ మిర్రర్స్, పొడవాటి సీటు, మిడ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, నిటారుగా రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంటుంది. సస్పెన్షన్ కోసం ఇన్వర్టెడ్ ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్ షాక్ యూనిట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లతో సూపర్ మోటోర్ మాదిరిగానే ఉంటుంది.