6 Big Rules Change : బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు నుంచి యూపీఐ, LPG ధరలపై ఎఫెక్ట్.. సామాన్యుడి జేబుకు చిల్లే..!
6 Big Rules Change : ఆగస్టు 2025 నుంచి క్రెడిట్ కార్డులు, LPG ధరలలో మార్పులు ఉండవచ్చు. UPI రూల్స్ కూడా మారబోతున్నాయి.

6 Big Rules Change
6 Big Rules Change : వినియోగదారులకు బిగ్ అలర్ట్.. 2025 ఏడాదిలో ప్రతినెల మాదిరిగానే ఆగస్టు నెలలో కూడా అనేక రూల్స్ మారబోతున్నాయి. ఈ కొత్త రూల్స్ (6 Big Rules Change) సామాన్యులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రధానంగా క్రెడిట్ కార్డ్, LPG ధరల్లో మార్పులు ఉండవచ్చు. యూపీఐకి సంబంధించి కూడా అనేక మార్పులు రానున్నాయి. ఈ 6 మార్పులతో మీ నెలవారీ బడ్జెట్ పై ప్రభావం పడవచ్చు. వచ్చే నెల నుంచి ఏయే రూల్స్ మారుతున్నాయో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
1. క్రెడిట్ కార్డ్‌లో మార్పులు :
మీరు SBI కార్డ్ హోల్డర్ అయితే.. బిగ్ షాక్. ఎందుకంటే.. ఆగస్టు 11 నుంచి ఎస్బీఐ అనేక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ఫ్రీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్‌ను నిలిపివేయనుంది. ఇప్పటివరకు SBI-UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, PSB, కరూర్ వైశ్య బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లతో పాటు కొన్ని ELITE, PRIME కార్డులపై రూ. 1 కోటి లేదా రూ. 50 లక్షల కవర్‌ను అందించేవి.
2. LPG ధరలలో మార్పు :
ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా LPG లేదా వాణిజ్య సిలిండర్ ధరలో మార్పు ఉండవచ్చు. జూలై 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను మార్చారు. దాంతో రూ.60 తగ్గించారు. కమర్షియల్ సిలిండర్ ధర చాలాసార్లు మారింది. కానీ, LPG సిలిండర్ ధర ఇంకా మారలేదు. ఆగస్టు 1 నుంచి LPG ధరలో తగ్గింపు ఉండొచ్చు.
3. ఈ UPI రూల్స్ మార్పు :
ఆగస్టు 1 నుంచి యూపీఐకి సంబంధించి అనేక కొత్త రూల్స్ రానున్నాయి. మీరు Paytm, PhonePe, GPay లేదా ఏదైనా ఇతర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్ నుంచి పేమెంట్ రెగ్యులర్ చేస్తున్నారా? పేమెంట్స్ ప్రాసెస్ వేగంగా జరిగేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనేక రూల్స్ మార్చింది.
NPCI కొన్ని కొత్త లిమిట్స్ విధించింది. మీ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ బ్యాలెన్స్ చెక్, స్టేటస్ రిఫ్రెష్, ఇతర విషయాలపై పరిమితిని విధించింది. ఇప్పుడు మీ UPI యాప్ నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. మీరు మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లను రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేయగలరు.
నెట్‌ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల వంటి ఆటోపే లావాదేవీలు ఇప్పుడు 3 టైమింగ్ స్లాట్‌లలో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 9.30 తర్వాత జరుగుతాయి. ఇప్పుడు మీరు రోజుకు 3 సార్లు మాత్రమే ఫెయిల్ ట్రాన్సాక్షన్ల స్టేటస్ చెక్ చేయగలరు. ప్రతి చెక్ మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉంటుంది.
4. CNG, PNG ధరలో మార్పు :
చమురు కంపెనీలు ప్రతి నెలా CNG, PNG ధరలను కూడా మారుస్తుంటాయి. కానీ, ఏప్రిల్ నుంచి ఎలాంటి మార్పు చేయలేదు. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలో చివరి మార్పు ఏప్రిల్ 9న జరిగింది. ఆ తర్వాత ముంబైలో సీఎన్‌జీ రూ. 79.50/కేజీ, పీఎన్‌జీ రూ. 49/యూనిట్ పెరిగింది. గత 6 నెలల్లో నాల్గోసారి పెరిగింది.
5. బ్యాంకు సెలవులు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. వారాంతాలు మినహా పండుగలు, ఇతర ముఖ్యమైన తేదీలలో బ్యాంకులు మూసివేయాలని RBI సూచించింది. అయితే, ఈ బ్యాంకు సెలవులు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు తేదీలలో ఉండవచ్చు.
6. ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు
ఆగస్టు 1 నుంచి ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు కూడా మారనున్నాయి. ఎందుకంటే చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG ధరను మాత్రమే కాకుండా ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలను కూడా నెలలో మొదటి తేదీన మారుస్తాయి.