Aadhaar Card : మీ ఆధార్ కార్డును అర్జంట్‌గా లింక్ చేయండి.. ఏయే సేవలకు ఆధార్ తప్పనిసరంటే? ఫుల్ లిస్ట్ మీకోసం..!
Aadhaar Card : మీ ఆధార్ కార్డును వివిధ ప్రభుత్వ సేవలతో లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే అనేక ప్రయోజనాలను కోల్పోతారు..

Aadhaar Card
Aadhaar Card : ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు చాలా ముఖ్యం. ప్రభుత్వ పథకాల నుంచి వ్యక్తిగత అవసరాల వరకు అన్నింటికి ఆధార్ తప్పనిసరి. అందుకే, ఆధార్ (Aadhaar Card) కార్డును బ్యాంకులతో సహా వివిధ ప్రభుత్వ సేవలతో లింక్ చేయడం కీలకంగా మారింది. ముఖ్యంగా, బ్యాంకు అకౌంట్లు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు, LPG కనెక్షన్లు వంటి వివిధ సేవలకు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి.
మీడియా నివేదికల ప్రకారం.. ఆధార్ లింక్ చేయకపోతే సబ్సిడీలు, ప్రయోజనాలు పొందలేరు. ఆధార్‌ను బ్యాంకుతో లింక్ చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. అందులో ఆధార్, అడ్రస్ ప్రూఫ్, పాస్‌బుక్ కాపీ) బ్రాంచ్‌ను విజిట్ చేయండి. ఫారమ్‌ను నింపిన తర్వాత సమర్పించండి.
ఆధార్ అవసరం ఎక్కడంటే? :
- బ్యాంకు అకౌంట్
- పాన్ కార్డ్
- గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ
- రేషన్ కార్డు
- PF అకౌంట్
ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేసేందుకు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీ ఆధార్, పాన్ వివరాలను ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫై చేసుకోండి. రేషన్ కార్డులు, LPG కోసం ఫేస్ అథెంటికేషన్ KYC కోసం ఆధార్ FaceRD యాప్‌ని ఉపయోగించండి. అదే మెథడ్ ద్వారా e-KYC స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.
7ఏళ్ల లోపు పిల్లలకు (Aadhaar Card) బయోమెట్రిక్ అప్‌డేట్ :
పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్‌ను వెంటనే అప్‌డేట్ చేయించాలని కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులను కోరుతోంది. 7 ఏళ్ల వయస్సు వచ్చిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయించుకోవాలని కోరింది. 7 ఏళ్ల వయస్సు నిండినప్పటికీ ఇంకా ఆధార్‌లో పిల్లల బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయకపోతే వెంటనే చేయించుకోవాలి.
నివేదిక ప్రకారం.. బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియకు సంబంధించి పిల్లల ఆధార్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌లకు SMS పంపుతున్నట్టు UIDAI తెలిపింది. ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. పిల్లల ఆధార్ కోసం తల్లిదండ్రులు లేదా గార్డియన్లు తమ పిల్లల వివరాలను ఏదైనా ఆధార్ సర్వీసు సెంటర్ లేదా ఇతర ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో అప్‌డేట్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా, 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కోసం ఫొటోగ్రాఫ్, పేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్రస్, తల్లిదండ్రుల ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేసుకోవచ్చు.