Samsung Smart TV
Samsung Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. శాంసంగ్ 65-అంగుళాల స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 30వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో (Samsung Smart TV) అందుబాటులో ఉంది. మీరు క్యాష్‌బ్యాక్ కార్డ్ డిస్కౌంట్‌లతో ఈ టీవీపై మరిన్ని డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ సరసమైన బ్రాండెడ్ టీవీ తగ్గింపు ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ 163cm (65 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ టైజెన్ టీవీ :
ప్రస్తుతం శాంసంగ్ 65-అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం రూ.29,292కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. ఈ టీవీ అసలు ధర రూ.91,100 ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ.29,292కు కొనుగోలు చేయవచ్చు.
మోడల్ నంబర్ UA65DU7660KLXL గల ఈ టీవీపై ఎలాంటి కార్డ్ డిస్కౌంట్ లేదా క్యాష్‌బ్యాక్ లేదు. రూ.91,100 విలువైన టీవీని రూ.29,292కు కొనుగోలు చేసుకోవచ్చు. మీరు నేరుగా ఈ ధరకు టీవీని కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ 65-అంగుళాల స్మార్ట్ టీవీపై ఇతర డిస్కౌంట్లు :
శాంసంగ్ 65-అంగుళాల టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.29,292కి అందుబాటులో ఉంది. ఈ టీవీపై అనేక ఇతర డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. ఉదాహరణకు.. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్‌తో మీరు ఈ టీవీపై 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ రూ.750 వరకు ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీరు 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు . ఎస్బీఐ కార్డ్‌తో రూ.4వేల వరకు ఉంటుంది. మీరు ఈ టీవీని కొనుగోలు చేస్తే మీ పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేసుకోండి. మీరు రూ.9,850 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్ మీ టీవీ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ అల్ట్రా HD 4K డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ సైజు 65 అంగుళాలు. ఈ టీవీ 3840×2160 రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ టీవీలో మీకు 20W స్పీకర్లు 50Hz రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. ముఖ్యంగా, ఈ టీవీ 4K అప్‌స్కేలింగ్ ఫీచర్‌తో వస్తుంది.
4K క్వాలిటీ లేని కంటెంట్‌ను 4K క్వాలిటీలో వీక్షించవచ్చు. శాంసంగ్ నుంచి వచ్చిన ఈ 65-అంగుళాల స్మార్ట్ టీవీ కూడా శాంసంగ్ సొంత టైజెన్ OSతో వస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరమైన అన్ని యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. మీరు శాంసంగ్ టీవీని ఉపయోగిస్తే.. మీరు టీవీ నుంచి ఫోన్‌ను టీవీ నుంచి ఫోన్‌ను చాలా ఈజీగా వినియోగించుకోవచ్చు.
వారంటీ ఎంతంటే? :
ఈ 65-అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ స్పెషాలిటీ ఏంటంటే.. 2 ఏళ్ల వారంటీతో వస్తుంది. టీవీ 2 ఏళ్లలోపు ఏదైనా పాడైతే కంపెనీ నుంచి ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చు. అయితే, ఈ లోపం ఫిజికల్ డ్యామేజీ కాకూడదు. వారంటీ మొదటి ఏడాదిలో మొత్తం టీవీని కవర్ చేస్తుంది. టీవీలో ఏదైనా లోపాన్ని కంపెనీ రిపేర్ చేస్తుంది. అయితే, రెండో సంవత్సరం వారంటీ టీవీ ప్యానెల్ లేదా డిస్‌ప్లేను మాత్రమే కవర్ చేస్తుంది.