Samsung Galaxy A35 5G
Samsung Galaxy A35 5G : కొత్త శాంసంగ్ ఫోన్ అతి తక్కువ ధరకే కావాలా? శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. గత ఏడాదిలో గెలాక్సీ A55తో (Samsung Galaxy A35 5G) పాటు లాంచ్ అయింది. ఈ ఏడాదిలో గెలాక్సీ A36 5G లాంచ్ తర్వాత కంపెనీ ఈ ఫోన్ ధరను మరింత తగ్గించింది. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ A35 5G అసలు లాంచ్ ధర రూ. 30,999 కన్నా రూ. 12వేల వరకు తగ్గించింది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A35 డిస్కౌంట్ :
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ మొత్తం (8GB ర్యామ్+ 128GB, 8GB ర్యామ్ + 256GB) 2 స్టోరేజ్ (Samsung Galaxy A35 5G) వేరియంట్లలో వస్తుంది. బేస్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 21,999, టాప్ వేరియంట్ రూ. 23,999కు కొనుగోలు చేయొచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆసమ్ ఐస్ బ్లూ, యాసమ్ నేవీ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. ఇందులో 5 శాతం క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఫోన్ రూ.21,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ వాల్యూ రూ.7వేలు ఉంటే.. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.15వేలకే సొంతం చేసుకోవచ్చు. కచ్చితమైన వాల్యూ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 6.6-అంగుళాల FHD+ సూపర్ (Samsung Galaxy A35 5G) అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. శాంసంగ్ ఇన్-హౌస్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో పాటు 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.
కెమెరా సెటప్‌లో OISతో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP అడ్వాన్స్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. గెలాక్సీ A35 5G ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. USB టైప్-C పోర్ట్ ద్వారా 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ యూఐ 6పై రన్ అవుతుంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో మాదిరిగానే గూగుల్ జెమిని ఆధారిత గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తుంది.