Samsung Galaxy A55 5G : అమెజాన్ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్.. ఏకంగా రూ.12వేలు డిస్కౌంట్..!
Samsung Galaxy A55 5G : అమెజాన్ ఆఫర్ అదిరింది.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Samsung Galaxy A55 5G
Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 30వేల లోపు ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ A55 5G ధర (Samsung Galaxy A55 5G) భారీగా తగ్గింది. శాంసంగ్ కెమెరా సిస్టమ్ ఇష్టపడే వారికి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. రూ. 39,999 ధరకు వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ. 12వేల ధర తగ్గింపుతో లభ్యమవుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ అమోల్డ్ డిస్‌ప్లే, 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. తక్కువ ఖర్చుతో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. శాంసంగ్ గెలాక్సీ A55 డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 ధర కేవలం రూ.27,999కే లభిస్తుంది. లాంచ్ ధరపై రూ.12వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. రూ. 26,550 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A55 స్పెసిఫికేషన్లు (Samsung Galaxy A55 5G) :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 6.60-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను 2340×1080 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, హుడ్ కింద 256GB స్టోరేజీని అందిస్తుంది.
ఈ ఫోన్ బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 14 రన్ అవుతుంది. 25W ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP కెమెరా, 5MP కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సింగిల్ 32MP సెన్సార్‌ను కలిగి ఉంది.