Amazon Prime Day 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025.. శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ ఫోన్ల వరకు టాప్ 5 డీల్స్ మీకోసం..!
Amazon Prime Day 2025 : అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు టాప్ 5 డీల్స్ మీకోసం..

Amazon Prime Day 2025
Amazon Prime Day 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. జూలై 12 నుంచి ఈ సేల్ ప్రారంభం (Amazon Prime Day 2025) కానుంది.
రాబోయే 3 రోజుల సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, వేరబుల్ డివైజ్‌లు, ఇతర కేటగిరీలపై 40శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్‌ప్లస్ 13R, ఐఫోన్ 15, ఐక్యూ నియో 10 వంటి మరెన్నో ఫోన్లపై అమెజాన్ టాప్ డీల్స్ ప్రకటించింది.
కొనుగోలుదారులు సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో పాటు అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందవచ్చు. ఈ వార్షిక సేల్ ప్రతి ఏడాదిలో ప్రత్యేకంగా ప్రైమ్ సభ్యుల కోసం అందుబాటులో ఉంటుంది. ఈసారి ప్రైమ్ డే సేల్ సమయంలో కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా లాంచ్ ధరపై రూ.60వేల భారీ తగ్గింపు అందించనుంది. ఈ శాంసంగ్ ఫోన్ రూ.74,999 లోపు అందుబాటులో ఉంటుంది. అదనంగా, ICICI, SBI క్రెడిట్ కార్డులపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ గత ఏడాదిలో రూ.1,34,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ 200MP-లీడ్ క్వాడ్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, భారీ బ్యాటరీతో డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఆపిల్ ఐఫోన్ 15 :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ రూ.57,249 కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఐఫోన్ రూ.69,900 ధరకు లాంచ్ కాగా బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ ఐఫోన్ మోడల్ 6.1 సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 48MP-లీడ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్ కలిగి ఉంది.
Read Also : Vivo X200 FE : ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త వివో X200 FE ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, కెమెరా, ధర వివరాలివే..!
వన్‌ప్లస్ 13R 5G స్పెసిఫికేషన్లు :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో వన్‌ప్లస్ 13R ఆకర్షణీయమైన డీల్ అందిస్తోంది. వన్‌ప్లస్ 13R 5G ఫోన్ రూ. 44,999 ధరకు లాంచ్ కాగా అమెజాన్‌లో రూ. 40వేల కన్నా తగ్గింపు ధరకే పొందవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, 6,000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
ఐక్యూ నియో 10R 5G :
ఐక్యూ నియో 10R ఫోన్ ధర రూ.26,999కు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.23,499 లోపు ధరకే పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, 80W ఫ్లాష్‌ఛార్జ్, 6,400mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G :
వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G ఫోన్ రూ.20వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో లాంచ్ ధరపై రూ.5వేల తగ్గింపుతో రూ.15,999కి అందుబాటులో ఉంటుంది. 5500mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.67-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 50MP సోనీ LYT-600 LED డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది.