Samsung Galaxy S24+ 5G
Samsung Galaxy S24+ 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5జీపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ 5జీ ఫోన్ హై-ఎండ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, మల్టీఫేస్ కెమెరాలు వంటి అత్యున్నత స్థాయి ఫీచర్లను కలిగి ఉంది.
ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధరపై రూ. 43వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఇతర ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్‌లతో తక్కువ ధరకే ఈ 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడే ఈ 5జీ ఫోన్ కొనుగోలు చేయాలా? లేదా ఇంకా మంచి ఆఫర్ కోసం వేచి ఉండాలా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G ప్రాసెసర్ :
శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G, శాంసంగ్ Exynos 2400 చిప్‌సెట్‌తో వస్తుంది. 3.2GHz డెకా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB ర్యామ్ కాన్ఫిగరేషన్, గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీ-టాస్కింగ్‌కు బెస్ట్ అని చెప్పవచ్చు. 256GB ఇంటర్నల్ స్టోరేజీ యాప్‌లు, ఫొటోలు, సినిమాలు స్టోర్ చేయొచ్చు. ఈ ఫోన్‌లో మైక్రో SD ఎక్స్‌పాండ్ స్లాట్ లేదు.
డిస్‌ప్లే, బ్యాటరీ మన్నిక :
శాంసంగ్ డిస్‌ప్లే సామర్థ్యం, గెలాక్సీ S24+ 5G భిన్నంగా ఉండదు. 1440 x 3120 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే స్క్రీన్‌తో వస్తుంది. 513ppi పిక్సెల్ సాంద్రత కలిగి ఉంది. అయితే, 2600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది.
120Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ స్క్రోలింగ్, యానిమేషన్‌లను అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కూడా ఉంది. గీతలు, పగుళ్లు లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యమే. ఈ ఫోన్ 4900mAh బ్యాటరీతో వస్తుంది. రోజంతా ఛార్జింగ్ వస్తుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, మరో ఫోన్ ఛార్జ్ చేసేందుకు 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24+ 5G కెమెరాలు :
గెలాక్సీ ఫ్లాగ్‌షిప్‌లలో కెమెరాలకు ఇప్పటికీ క్రేజ్ ఉంది. గెలాక్సీ S24 ప్లస్ 5G కెమెరాలు అద్భుతంగా ఉన్నాయి. 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, OISతో 10MP టెలిఫోటో లెన్స్‌తో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఎలాంటి లైటింగ్ కండిషన్లలో కూడా ఆకర్షణీయమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
ప్రొఫెషనల్-గ్రేడ్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ద్వారా 30fps వద్ద 8K వీడియోలను రికార్డ్ చేయొచ్చు. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. శాంసంగ్ AI ప్రాసెసింగ్ డిఫరెంట్ కలర్లను అందిస్తుంది. సెల్ఫీలు అద్భుతంగా వస్తాయి. ఫోటోలు తీయడం లేదా వీడియోలను రికార్డింగ్ కోసం ఆకర్షణీయమైన కెమెరా సిస్టమ్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G ధర :
రూ.99,999 ప్రారంభ ధరతో శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G ఫోన్ ఇప్పుడు రూ. 56,999 ధరకు లభిస్తుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో ప్రస్తుతం రూ. 43వేలు తగ్గింపు అందిస్తోంది. ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే డిస్కౌంట్ ధరతో పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు :
అదనపు బెనిఫిట్స్ కోసం బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కస్టమర్లకు 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నెలకు రూ. 9,500 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G కస్టమర్లు ఈఎంఐ ద్వారా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.
Read Also : Insurance GST : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి, తీసుకోబోయే వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త..?
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు :
మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ మోడల్ ఆధారంగా శాంసంగ్ రూ.35,750 వరకు ధర ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. మొత్తం ధర మళ్లీ తగ్గుతుంది.
ప్రస్తుత డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో ఈ ప్రీమియం ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఇప్పుడే కొనాలా? వేచి ఉండాలా? :
రూ. 43వేలు ధర తగ్గింపు, అదనపు ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో గెలాక్సీ S24 ప్లస్ 5G ఒక అద్భుతమైన డీల్. ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, టాప్ రేంజ్ కెమెరాలు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ధర తగ్గింపు కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.