Samsung Galaxy S24 Series : 2024లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్
Samsung Galaxy S24 Series : శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Samsung Galaxy S24 series price details leak ahead of January 2024 launch event
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్‌కు కొన్ని వారాల సమయమే ఉంది. ఎందుకంటే.. రాబోయే ఫ్లాగ్‌షిప్‌ల లాంచ్ తేదీ జనవరి 17, 2024గా నివేదికలు సూచిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. ఇప్పుడు, రాబోయే శాంసంగ్ ఫోన్‌ల ధరలు కూడా లాంచ్ ఈవెంట్‌కు వారాల ముందు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also : Samsung Galaxy A Series 5G : హై-ఎండ్ ఫీచర్లతో శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోన్లు.. ధర కేవలం రూ.19,499 మాత్రమే!
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ధర 2024 జనవరి లాంచ్ ఈవెంట్‌కు ముందు లీక్ అయింది. గెలాక్సీక్లబ్ (డచ్) డివైజ్ యూరోపియన్ ధరలను పొందినట్లు పేర్కొంది. అయితే, లీక్ అయిన ధరల భాగానికి వెళ్లే ముందు, భారతీయ ధరలు సాధారణంగా యూరోపియన్ మార్కెట్ కన్నా చాలా తక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ధర ఎంత ఉండొచ్చుంటే? :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ కంపెనీ కొత్త వెర్షన్‌ల ధరను కొన్ని వేలు మాత్రమే పెంచనుందని భావిస్తున్నారు. 2024 శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌లతో వస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

Samsung Galaxy S24 series price
యూరప్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు ఈయూఆర్ 899 (సుమారు రూ. 82వేల) ప్రారంభ ధరతో వస్తుంది. 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర ఈయూఆర్ 959 (సుమారు రూ. 88వేలు) ఉండవచ్చు. గెలాక్సీ ఎస్24+ ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర ఈయూఆర్ 1,149 (సుమారు రూ. 1,05,000) మధ్య ఉండవచ్చు.
ఏ వేరియంట్ ధర ఎంత ఉండొచ్చుంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా బ్రాండ్ నుంచి అత్యంత ప్రీమియం ఆఫర్‌గా అందించనుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ వెర్షన్ ధర ఈయూఆర్ 1,449 (సుమారు రూ. 1,33,500) ధర ఉంటుంది. శాంసంగ్ అల్ట్రా మోడల్‌ను 12జీబీ ర్యామ్+ 512జీబీ 12జీబీ + 1టీబీ వేరియంట్‌లతో రానుంది. ఈ శాంసంగ్ ధర వరుసగా ఈయూఆర్ 1,569 (దాదాపు రూ. 1,44,500), ఈయూఆర్ 1,809 (సుమారు రూ. 1,66,500) మధ్య ఉండవచ్చు.
శాంసంగ్ జనవరి 17న లాంచ్ అవుతుందని పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నందున 2024 ఈవెంట్‌కు సంబంధించిన తేదీలను కంపెనీ త్వరలో ప్రకటించవచ్చు. గత ఏడాదిలో ఈవెంట్‌కు కొన్ని వారాల ముందు బ్రాండ్ ఫీచర్ల వివరాలను వెల్లడించింది. లీక్ అయిన తేదీ కచ్చితమైనది అయితే, వినియోగదారులు రాబోయే రోజుల్లో గెలాక్సీ ఎస్24 సిరీస్ పొందవచ్చు.