Samsung Galaxy S24 Ultra 5G
Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై అమెజాన్ ఏకంగా రూ.31,533 వరకు తగ్గింపు అందిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సర్కిల్ టు సెర్చ్, ఏఐ కెమెరా, లైవ్ ట్రాన్స్‌లేట్, నోట్ అసిస్ట్ వంటి మరెన్నో ఏఐ ఫీచర్లతో సహా వైడ్ రేంజ్ ఫీచర్లతో వస్తుంది. ఈ 5జీ ఫోన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, క్వాడ్ కెమెరా సెటప్, S పెన్ సపోర్ట్ అందిస్తుంది. సాధారణంగా శాంసంగ్ స్టోర్‌లో దాదాపు రూ.1,19,900కి లభ్యమవుతుంది. మీరు ఈ శాంసంగ్ అల్ట్రా 5జీ ఫోన్ రూ.90వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ రూ.28,800 ధర తగ్గింపు పొందింది. దాంతో ఈ అల్ట్రా ఫోన్ ధర రూ.91,100 వద్ద లిస్టు అయింది. కస్టమర్లు అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ.2,733 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.90వేల కన్నా తక్కువకు పొందవచ్చు.
కొనుగోలుదారులు నెలకు రూ.4,417 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పాత ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5Gని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్, వేరియంట్, ఇతర అంశాలను బట్టి రూ.22,800 వరకు వాల్యూను పొందవచ్చు. కస్టమర్లు అదనంగా చెల్లిస్తే శాంసంగ్ కేర్ ప్లస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 1TB స్టోరేజీతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6.1తో వస్తుంది. అతి త్వరలో కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్‌లతో One UI 7 అప్‌డేట్ అందుకోనుంది. అంతే కాదు, వినియోగదారులు 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 6 OS అప్‌డేట్స్ పొందుతారు.
కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP ప్రైమరీ షూటర్, 5x జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ ఈ శాంసంగ్ ఫోన్ 23MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది.