Luxury Goods TCS : లగ్జరీ వాచ్ నుంచి హ్యాండ్‌బ్యాగుల వరకు.. రూ. 10 లక్షలకు పైగా లగ్జరీ వస్తువులపై టాక్స్ కట్టాల్సిందే.. ఎంతంటే?
Luxury Goods : గడియారాలు, అద్దాలు, బూట్లు, బ్యాగులు కొనుగోలుపై ఇప్పటినుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీబీడీటీ అనేక లగ్జరీ వస్తువులపై ఒక శాతం TCS విధించింది. ఏప్రిల్ 22 నుంచే కొత్త పన్ను అమల్లోకి వచ్చింది.

Watches To Handbags
Luxury Goods TCS : లగ్జరీ వస్తువుల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇప్పుడు రూ. 10 లక్షల మార్కును దాటిన కొన్ని లగ్జరీ వస్తువుల అమ్మకాలపై ఒక శాతం TCS వర్తిస్తుందని అధికారికంగా ప్రకటించింది.
ఏప్రిల్ 22, 2025 నుంచి ఈ కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చింది. రూ. 10 లక్షల కన్నా ఎక్కువ ధర ఉన్న హ్యాండ్‌బ్యాగులు, చేతి గడియారాలు, పాదరక్షలు, క్రీడా దుస్తులు ఒక శాతం టీసీఎస్ లోబడి ఉండే లగ్జరీ వస్తువులుగా పరిగణిస్తారు.
అయితే, ఇప్పుడు ఆ లగ్జరీ వస్తువుల జాబితాను ఆదాయ పన్ను శాఖ విడుదల చేసింది. ఈ ప్రొడక్టులపై అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ జాబితాలో లగ్జరీ వాచ్, అద్దాలు, బూట్లు, బ్యాగులు సహా అన్ని వస్తువుల కొనుగోలుపై ఒక శాతం టీసీఎస్ విధించనున్నట్టు తెలిపింది.
ఏప్రిల్ 21కి ముందు ఈ వస్తువులను కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి ఒక శాతం టీసీఎస్ వసూలు చేసేది ఉండదని CBDT స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి అంటే.. ఈ నెల 22 నుంచి కొత్త పన్ను అమలులోకి వచ్చింది. సీబీడీటీ నోటిఫికేషన్ ఏప్రిల్ 22న జారీ కాగా, ఆ తర్వాత మాత్రమే పన్ను అమలులోకి వస్తుందని టాక్స్ ఎక్స్‌పర్ట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
CBDT లిస్టులో ఏయే వస్తువులను చేర్చారంటే? :
- లగ్జరీ రిస్ట్ వాచ్
- పెయింటింగ్స్, ఐడల్స్ వంటి పురాతన వస్తువులు
- నాణేలు, స్టాంపులు మొదలైన వస్తువులు.
- లగ్జరీ బోట్స్, రోయింగ్ బోట్లు, పడవలు, హెలికాప్టర్లు
- లగ్జరీ సన్ గ్లాసెస్
- లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు, పర్సులు
- లగ్జరీ షూస్
- గోల్ఫ్ కిట్లు, స్కీ దుస్తులు వంటి క్రీడా వస్తువులు
- హోమ్ థియేటర్ సిస్టమ్
- పోలో లేదా రేస్ క్లబ్‌ల కోసం గుర్రాలను కొనడం.
రూ.10 లక్షల మార్క్ దాటితే 1 శాతం పన్ను :
రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే వస్తువులపై టీసీఎస్ విధించడం జరుగుతుందని సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. మీరు రూ.10 లక్షల విలువైన ఒమేగా లగ్జరీ వాచ్ కొనుగోలు చేస్తే.. దుకాణదారుడు కస్టమర్ నుంచి 1 శాతం టీసీఎస్ వసూలు చేస్తాడు.
అదేవిధంగా, మీరు రూ. 10 లక్షల కన్నా ఎక్కువ విలువైన హోమ్ థియేటర్ సిస్టమ్ కొనుగోలు చేస్తే.. విక్రేతలు మీ నుంచి పన్ను కూడా వసూలు చేస్తాడు. ప్రస్తుతం, రూ.10 లక్షల కన్నా ఎక్కువ ధర ఉన్న వాహనాలపై కూడా టీసీఎస్ విధిస్తారు.
📢CBDT Notification Alert!
➡️New rules issued for Tax Collection at Source (TCS) on the purchase of certain goods.
✅Notification S.O. 1825(E) dated 22.04.2025 published in https://t.co/wgrnm5QBDw
🔗The Notification can be accessed at:https://t.co/6GAXN2t5RS pic.twitter.com/zoRIH6NkXd
— Income Tax India (@IncomeTaxIndia) April 23, 2025
ITRలో TCS క్లెయిమ్ చేయొచ్చు :
కస్టమర్ TCSను డిపాజిట్ చేసిన తర్వాత కొనుగోలుదారులు పాన్‌లో దుకాణదారుడి బాధ్యత అని సీబీడీటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొనుగోలుదారులు దాంతో టాక్స్ క్రెడిట్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు పన్ను తక్కువగా చెల్లించవచ్చు.
ఎంప్లాయర్ జీతం నుంచి TDSను తీసివేసి ఉద్యోగి పాన్‌లో జమ చేసినట్లే. మీ మొత్తం పన్ను బాధ్యత TCS మొత్తం కన్నా తక్కువగా ఉంటే.. మీరు మీ ITRలో రీఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇందుకోసం కొనుగోలుదారు పన్ను క్రెడిట్ చేసిన తర్వాత విక్రేతల నుంచి టీసీఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి.
టాక్స్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. లగ్జరీ వస్తువులపై TCS విధించే పన్ను బేస్‌ను పెంచేందుకు వీలుంటుంది. ఇలాంటి లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసేవారు అదనపు కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు విక్రేతలు TCS నిబంధనలను తప్పక పాటించాలి. అయితే నోటిఫైడ్ లగ్జరీ వస్తువుల కొనుగోలుదారులు కొనుగోలు సమయంలో కేవైసీ, డాక్యుమెంటేషన్‌ను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.