Gmail Users Alert : జీమెయిల్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. కొత్త సైబర్ స్కామ్‌తో జాగ్రత్త.. ఇప్పుడే ఈ పని చేయండి.. స్కామ్‌ను ఎలా గుర్తించాలంటే?
Gmail Users Alert : కొత్త సైబర్ స్కామ్ విషయంలో గూగుల్ జీమెయిల్ యూజర్లకు హెచ్చరిస్తోంది. మీ జీమెయిల్ ఏ క్షణమైనా హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తోంది.

Gmail phishing attack
Gmail Users Alert : ప్రపంచ టెక్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ జీమెయిల్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ల మంది జీమెయిల్ యూజర్లందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఫిషింగ్ స్కామ్‌ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని గూగుల్ హెచ్చరిస్తోంది.
జీమెయిల్ యూజర్లకు అత్యంత ప్రమాదకరమైన సైబర్ దాడి జరిగిందని, సైబర్ నేరగాళ్లు ప్లాట్ ఫారంలో సాంకేతిక లోపాలను వాడుకుని సైబర్ దాడులకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తోంది. గూగుల్ ఫోన్ కాల్స్, ఫాలో-అప్ ఈమెయిల్స్‌ను గుర్తించలేని విధంగా ఏఐ సాయంతో సైబర్ నేరస్థులు పంపిస్తున్నారని, వినియోగదారులు ఎట్టిపరిస్థితుల్లో డేంజరస్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని సూచించింది.
సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులతో ఈ స్కామ్‌కు పాల్పడ్డారని హెచ్చరించింది. ఈ సైబర్ దాడి తర్వాత సోషల్ మీడియాలో పుకార్లు వెల్లువెత్తాయి. గూగుల్ వెంటనే సెక్యూరిటీ అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఇకపై జీమెయిల్ యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను వాడటం మానేయాలని సెర్చ్ దిగ్గజం స్పష్టం చేసింది.
అసలేంటి కొత్త సైబర్ స్కామ్? :
వాస్తవానికి, ఈ సైబర్ దాడి ముందుగా (Ethereum) డెవలపర్ నిక్ జాన్సన్‌పై జరిగింది. ఫిషింగ్ అటాక్ ద్వారా స్కామర్లు పాల్పడ్డారు. తన అకౌంట్‌కు లీగల్ నోటీసు జారీ అయిందని పేర్కొంటూ గూగుల్ నుంచి ఇమెయిల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ ఇమెయిల్ no-reply@google.com నుంచి వచ్చింది. చూసేందుకు అచ్చం రియల్ ఈమెయిల్ మాదిరిగా కనిపించింది.
అందులో DKIM సిగ్నేచర్ కూడా ఉంది. జీమెయిల్ రెగ్యులర్ సెక్యూరిటీ వార్నింగ్ అని నమ్మారు. నిజానికి, హ్యాకర్లు గూగుల్ వ్యవస్థలోని లోపాన్ని ఆసరాగా చేసుకుని తమకు తాముగా అథెంటికేషన్ ఇమెయిల్స్ పంపుతుంటారు. ఆపై వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేశారు. ఈ స్కామ్ అసలు ఉద్దేశం.. యూజర్ల నుంచి లాగిన్ వివరాలను దొంగిలించడమే.. ఆ తర్వాత యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాక్ చేస్తారు.
గూగుల్ ఏం చెబుతుదంటే? :
“ఇలాంటి సైబర్ దాడుల గురించి మాకు తెలుసు. గత వారం నుంచి సెక్యూరిటీపరమైన చర్యలను చేపడుతున్నాం” అని కంపెనీ తెలిపింది. జీమెయిల్ యూజర్లు తమ పాస్‌వర్డ్‌కు బదులుగా పాస్‌కీని ఉపయోగించమని సూచిస్తుంది. ఎందుకంటే.. పాస్‌కీ యూజర్ల డివైజ్‌కు లింక్ అయి ఉంటుంది. ఆ డివైజ్ లేకుండా అకౌంట్ యాక్సెస్ చేయడం అసాధ్యం.
పాస్‌కీ ఎందుకు అవసరం? :
ప్రస్తుత రోజుల్లో పాస్‌వర్డ్‌లు, SMS ఆధారిత టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA) కూడా సులభంగా హ్యాక్ చేయొచ్చు. సైబర్ దాడికి పాల్పడే స్కామర్లు యూజర్ పాస్‌వర్డ్‌తో పాటు SMS కోడ్‌ను దొంగిలిస్తారు. దాంతో ఏ డివైజ్ నుంచైనా మీ అకౌంట్ లాగిన్ అవ్వవచ్చు. కానీ, మీ డివైజ్ భద్రతను (ఫింగర్ ఫ్రింట్ లేదా పిన్ వంటివి) ఉపయోగించి అకౌంట్ యాక్సెస్ చేస్తేనే పాస్‌కీ పనిచేస్తుంది.
మీ జీెమెయిల్ ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి :
- మీ Gmail అకౌంట్‌కు పాస్‌కీని సెట్ చేసుకోండి.
- SMS కాకుండా (Google Authenticator) లేదా డివైజ్ ఆధారిత వెరిఫికేషన్ ఉపయోగించండి.
- గూగుల్ క్రమంగా పాస్‌వర్డ్‌లను వాడకాన్ని నిలిపివేయనుంది.
- గూగుల్ ప్రాంప్ట్ వాడండి. చాలా సేఫ్.. ఈజీగా యాక్సస్ చేయొచ్చు.
- మీ రికవరీ ఫోన్ నంబర్, ఇమెయిల్‌ను యాడ్ చేయండి.
- తరచుగా ఫోన్, ఇమెయిల్ అప్‌డేట్ చేస్తూ ఉండండి.
- సెక్యూరిటీ అలర్ట్ ఊహించని ఇమెయిల్‌లలోని లింక్‌లను క్లిక్ చేయొద్దు.
- అకౌంట్ సెక్యూరిటీ గురించి గూగుల్ ఎప్పుడూ యూజర్లను నేరుగా సంప్రదించదు.