Samsung Galaxy S24 Ultra 5G
Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే వస్తోంది. అమెజాన్‌లో భారీ (Samsung Galaxy S24 Ultra 5G) తగ్గింపుతో అందుబాటులో ఉంది. S పెన్ సపోర్ట్, క్వాడ్ కెమెరా సెటప్, అమోల్డ్ ప్యానెల్, గెలాక్సీ ఏఐ వంటి అనేక ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది.
మీరు కూడా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఇదే బెటర్ టైమ్.. దాదాపు రూ. 85వేల లోపు బడ్జెట్‌లో కొనేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర తగ్గింపును ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ S24 అల్ట్రా 5G ధర :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ధర అసలు ధర రూ. 1,21,999 ఉండగా రూ.36,410కి తగ్గింది. దాంతో ప్రస్తుతం రూ.83,589కి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
అయితే, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ఇంకా తగ్గాలంటే.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2,500 కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.
తద్వారా ధర రూ.81,100 కన్నా తగ్గుతుంది. మొత్తం మీద దాదాపు రూ.39వేలు తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ మీరు EMI ద్వారా కొనుగోలు చేస్తే.. అమెజాన్‌లో నెలవారీ ఈఎంఐ రూ.4,053 నుంచి పొందవచ్చు.
ఆసక్తిగల వినియోగదారులు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.48,550 వరకు సేవ్ చేసుకోవచ్చు. అయితే, వర్కింగ్ కండిషన్లు, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు అదనపు వారంటీ లేదా శాంసంగ్ కేర్ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్పెషిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ (Samsung Galaxy S24 Ultra 5G) 6.8-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్ కంటెంట్ స్ట్రీమింగ్ , స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, 12GB వరకు LPPDR5X RAMతో గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 45W బ్యాటరీని కూడా కలిగి ఉంది. భారీగా వాడినా కూడా బ్యాకప్ సమస్య ఉండదు.
Read Also : Oppo Reno 12 Price : ఒప్పో రెనో 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ మీకోసం..!
ఇంటర్‌ప్రెటర్, లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 10MP టెలిఫోటో లెన్స్ కూడా అందిస్తుంది. 12MP ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తుంది.