Samsung Galaxy S24 Ultra : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై బంపర్ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మిస్ చేయకండి..!

Samsung Galaxy S24 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధరపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది.. ఈ డీల్ మీకోసమే..

1/7Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S24 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ధర భారీగా తగ్గింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌‌తో ఈ ఫోన్ శాంసంగ్ మల్టీ ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లతో మరింత తగ్గింపు ధరకే లభ్యమవుతోంది. ప్రస్తుతానికి, అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై రూ. 47,500 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
2/7Samsung Galaxy S24 Ultra
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర తగ్గింపు : 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్‌, అమెజాన్ ఇండియా నుంచి రూ.84,999కి కొనుగోలు చేయవచ్చు. అసలు లాంచ్ ధర రూ.1,34,999కు పొందవచ్చు.
3/7Samsung Galaxy S24 Ultra
అంతేకాకుండా, అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ.2,549 వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు. తద్వారా ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.82,499కి తగ్గుతుంది. టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైలెట్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
4/7Samsung Galaxy S24 Ultra
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కెమెరా, స్పెసిఫికేషన్లు : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ స్నాపర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి.
5/7Samsung Galaxy S24 Ultra
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ పిక్సెల్ (PDAF)తో 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
6/7Samsung Galaxy S24 Ultra
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. శాంసంగ్ అందించే 7 మెయిన్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది.
7/7Samsung Galaxy S24 Ultra
స్పీడ్ పర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ అడ్రినో 750 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.